For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs IND: టీమిండియా కొంపముంచిన స్టన్నింగ్ క్యాచ్!(వీడియో)

సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. టీమిండియాతో ఆదివారం జరిగిన రెండో టీ20లో స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని సూపర్ ఫీల్డింగ్‌కు తిలక్ వర్మ(20) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఎయిడెన్ మార్క్‌రమ్ వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ చివరి బంతిని మార్క్‌రమ్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో టాస్ అప్ డెలివరీ వేయగా.. తిలక్ వర్మ కవర్స్ వైపు భారీ షాట్ ఆడాడు. కానీ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మిల్లర్ సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకున్నాడు. రెప్పపాటు సమయంలోనే మిల్లర్ ఈ క్యాచ్ పట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మిల్లర్ స్టన్నింగ్ క్యాచ్‌తో తిలక్ వర్మ పోరాటం ముగిసింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

SA vs IND David Miller takes a blinder to dismiss Tilak Varma in 2nd T20I Video

15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ.. అక్షర్ పటేల్‌తో కలిసి ఆదుకునే ప్రయత్నం చేశాడు. పిచ్ బౌలింగ్‌‌కు అనుకూలంగా ఉండటంతో ఆచితూచి ఆడిన తిలక్ వర్మ 20 బంతుల్లో ఓ ఫోర్‌తో పాటు భారీ సిక్స్ బాది 20 పరుగులు చేశాడు. జట్టుకు అవసరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పే క్రమంలో మిల్లర్ స్టన్నింగ్ క్యాచ్‌తో తిలక్ వర్మను పెవిలియన్ చేర్చాడు.

ఈ స్టన్నింగ్ క్యాచ్‌ మ్యాచ్‌ను సౌతాఫ్రికావైపు మలుపు తిప్పింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన టీమిండియా.. ఆదిలోనే ఓపెనర్ సంజూ శాంసన్ వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్‌లోనే సంజూ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్‌లో అభిషేక్ శర్మ క్యాచ్ ఔటవ్వగా.. ఆ కాసేపటికే సూర్య వికెట్ల ముందు దొరికిపోయాడు.

డేవిడ్ మిల్లర్ స్టన్నింగ్ క్యాచ్‌కు తిలక్ వర్మ ఔటైతే.. పీటర్ బౌలింగ్‌లో దురదృష్టకర రీతిలో అక్షర్ పటేల్ రనౌటయ్యాడు. దాంతో 70 పరుగులకే టీమిండియా 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Story first published: Sunday, November 10, 2024, 20:58 [IST]
Other articles published on Nov 10, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+