SA vs IND: టీమిండియా తాత్కలిక సారథి సూర్యకుమార్ యాదవ్‌పై అభిమానులు మండిపడుతున్నారు. సౌతాఫ్రికాతో చివరి టీ20లో భారత తుది జట్టులో మార్పులు చేయకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌లకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండో టీ20లో దారుణంగా విఫలమైనా శుభ్‌మన్ గిల్‌తో పాటు కుల్దీప్ యాదవ్‌ను కొనసాగించడాన్ని తప్పుబడుతున్నారు. రెండో టీ20 పరాజయం అనంతరం తుది జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, ఇషాన్ కిషన్‌లను ఆడించకుండా తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్, జితేశ్ శర్మలను ఆడించడాన్ని భారత మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.

నెంబర్ వన్ టీ20 బౌలర్‌కు తుది జట్టులో చోటివ్వరా? అంటూ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కానీ ఈ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోని రాహుల్ ద్రవిడ్ అదే జట్టును బరిలోకి దించి.. పరోక్షంగా విమర్శకులకు ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. అయితే చివరి టీ20లోనూ శుభ్‌మన్ గిల్(12)తో పాటు తిలక్ వర్మ(0) దారుణంగా విఫలమవ్వడంతో.. అభిమానులు రాహుల్ ద్రవిడ్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడల్లా అతనికి అన్యాయం జరుగుతుందని గుర్తు చేస్తున్నారు. అండర్ 19 ప్రపంచకప్ జట్టు నుంచి రుతురాజ్ గైక్వాడ్‌ను రాహుల్ ద్రవిడ్ సహించడం లేదని విమర్శిస్తున్నారు. ద్రవిడ్ రెస్ట్‌లో ఉన్నప్పుడే రుతురాజ్ తుది జట్టులో అవకాశాలు అందుకుంటున్నాడని అభిప్రాయపడుతున్నారు.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో అసాధారణ శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్‌ను వరుసగా బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమని మండిపడుతున్నారు. ద్రవిడ్ రాజకీయాలకు రుతురాజ్ గైక్వాడ్ బలవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే పాపం రా సూరీడు.. అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాహుల్ ద్రవిడ్ తనకు నచ్చిన ఆటగాళ్లు విఫలమైనా.. వరుసగా అవకాశాలు కల్పిస్తాడని, మిగతా ఆటగాళ్లకు ఎలాంటి అవకాశం ఇవ్వడని గుర్తు చేస్తున్నారు. ఇలానే ఉమ్రాన్ మాలిక్ కెరీర్‌ను అటకెక్కించాడని, జట్టుకే దూరం చేశాడని మండిపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే శుభ్‌మన్ గిల్(12), తిలక్ వర్మ(0) వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన సూర్యతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.