Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే తుది జట్టు మార్పులు చేయలేదు: సూర్యకుమార్ యాదవ్

SA vs IND 3rd T20I: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ మాదిరి చేజింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌‌రమ్ తెలిపాడు.

'మేం మళ్లీ బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఇది చాలా ఫ్రెష్ వికెట్. గత మ్యాచ్‌లో మేం చేజింగ్ చేసిన విధానం పట్ల చాలా సంతోషంగా ఉంది. జట్టుగా అన్ని విషయాల్లో మేం పురోగతి సాధించాం. మరికొన్ని సమస్యలను అధిగమించేందుకు ఈ మ్యాచ్‌ను వాడుకుంటాం. భారత్‌పై సిరీస్ గెలవడం చాలా పెద్ద విషయం.

SA vs IND 3rd T20I: Suryakumar Yadav reveals the reason why India playing xi unchanded

ఇదో అద్భుతమైన వేదిక. కుర్రాళ్లంతా సత్తా చాటుతారని ఆశిస్తున్నా. ఈ మ్యాచ్‌కు మేం మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. కేశవ్ మహరాజ్, డోనోవన్ ఫెర్రేయిరా జట్టులోకి రాగా.. నాండ్రే బర్గర్ అరంగేట్రం చేస్తున్నాడు.'అని మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిచినా తాము బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. గత మ్యాచ్‌లో ఓడినా.. జట్టుగా అనేక సానుకూలాంశాలు లభించాయన్నాడు. దాంతోనే తుది జట్టును మార్చలేదని తెలిపాడు.

'మేం భారీ స్కోర్ చేసి ఆ లక్ష్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాం. పిచ్ చూడటానికి బాగుంది. పిచ్‌లో మార్పు ఉంటుందని అనుకోవడం లేదు. ఫియర్‌లెస్ గేమ్ ఆడాలని అనుకుంటున్నాం. మా బ్రాండ్ చూపించాలనుకుంటున్నాం. గత మ్యాచ్‌లో చాలా సానుకూలంశాలు లభించాయి. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

ఈ మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను వర్షం మింగేయగా.. వర్షం అంతరాయం కలిగించిన రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. అదే జోరులో చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఆ జట్టు అనుకుంటోంది. మరోవైపు ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. తుది జట్టు ఎంపిక విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా.. టీమిండియా మేనేజ్‌మెంట్ పట్టించుకోకపోవడం విశేషం.

తుది జట్లు:

భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ(కీపర్), రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.

సౌతాఫ్రికా: రీజా హెన్రీక్స్, మాథ్యూ బ్రీట్జ్‌కే, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరెయిరా, ఆండిలే పెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్, టబ్రైజ్ షంసీ, నండ్రే బర్లర్.

Story first published: Thursday, December 14, 2023, 20:35 [IST]
Other articles published on Dec 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+