SA vs IND: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. అయితే సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో అతన్ని దురదృష్టం వెంటాడింది. ఫీల్డ్ అంపైర్ తప్పిదంతో పాటు రివ్యూ తీసుకోకపోవడం అతని కొంపముంచింది.
మూడు బౌండరీలతో దూకుడు కనబర్చిన శుభ్‌మన్ గిల్.. కేశవ్ మహరాజ్ వేసిన మూడో ఓవర్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ ఓవర్ రెండో బంతిని స్వీప్ షాట్ ఆడబోయిన గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. సౌతాఫ్రికా ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఇక శుభ్‌మన్ గిల్ రివ్యూ విషయంపై నాన్ స్ట్రైకర్ యశస్వి జైస్వాల్‌తో చర్చించాడు.

అతను ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ శుభ్‌మన్ గిల్ రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో శుభ్‌మన్ గిల్ నాటౌట్ అని తెలింది. బాల్ ట్రాకింగ్‌లో బంతి స్టంప్స్‌ను మిస్సైంది. రివ్యూ తీసుకొని ఉంటే శుభ్‌మన్ గిల్ ఔటవ్వకుండా బచాయించేవాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రిప్లేలను చూసిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఇతర సపోర్ట్ స్టాఫ్.. అయ్యో అంటూ తలపట్టుకున్నారు.
అయితే రెండో టీ20లో కూడా శుభ్‌మన్ గిల్ ఎల్బీగానే వెనుదిరిగాడు. అప్పుడు రివ్యూ తీసుకున్నా ఫలితం దక్కలేదు. దాంతోనే ఈ మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ రివ్యూ తీసుకునేందుకు సంశయించాడు. ఏది ఏమైనా రివ్యూ తీసుకోకపోవడం శుభ్‌మన్ గిల్‌తో పాటు టీమిండియాకు నష్టం చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే శుభ్‌మన్ గిల్(12), తిలక్ వర్మ(0) వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన సూర్యతో కలిసి యశస్వి జైస్వాల్ జట్టును ఆదుకున్నారు. హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో టబ్రైజ్ షంసీ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్(41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.