Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs ENG: అందుకే మార్క్‌వుడ్, టెంబా బవుమా ఆడటం లేదు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ చూడటానికి బాగుంది. కొన్ని పగుళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇదే వికెట్‌పై జరిగిన సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ మ్యాచ్‌ను చూశాం. ఆ మ్యాచ్ ఫలితం ఆధారంగానే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాను.

ఇంగ్లండ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం తీసుకోవాలనుకోలేదు. ఇది చాలా సులువైన నిర్ణయం. అందుకే నేను కెప్టెన్సీ వదులుకున్నాను. ఈ రోజు మేం మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం బాధగానే ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించడంతో పాటు నాయకత్వం వహించడం ఏ ఆటగాడికైనా గొప్ప గౌరవమే. కెప్టెన్‌గా నాకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. గాయంతో మార్క్ వుడ్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. సకీబ్ మహ్మూద్ జట్టులోకి వచ్చాడు.'అని జోస్ బట్లర్ తెలిపాడు.

SA vs ENG Why Mark Wood and Temba Bavuma not playing in South Africa vs England Champions Trophy 2025 clash
Photo Credit: Twitter

మరోవైపు ఛేజింగ్ చేసే అవకాశం దక్కడంపై సంతోషంగా ఉన్నామని సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా అనారోగ్యంతో ఈ మ్యాచ్‌కు దూరమవడంతో మార్క్‌రమ్ జట్టును నడిపిస్తున్నాడు. 'ఛేజింగ్ చేసే అవకాశం రావడం పట్ల మేం సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఈ టోర్నీలో ఇప్పటి వరకు మేం ఛేజింగ్ చేయలేదు. బలమైన ఇంగ్లండ్‌ జట్టుపై ఛేజింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌కు అనారోగ్యంతో టోనీ, టెంబా బవుమా దూరమయ్యారు. దురదృష్టవశాత్తు ఈ ఇద్దరూ తాజా మ్యాచ్ ఆడటం లేదు. కానీ తదుపరి మ్యాచ్‌ల్లోపు వారు కోలుకుంటారని ఆశిస్తున్నాం.

ఈ ఇద్దరి స్థానాల్లో స్టబ్స్, క్లాసెన్ జట్టులోకి వచ్చారు. మంచి టెక్నిక్ ఉన్న స్టబ్స్ ఓపెనింగ్ చేస్తాడు. మా గత మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. మేం కొన్ని ట్రైనింగ్ సెషన్స్‌తోనే ఈ మ్యాచ్‌కు సిద్దమయ్యాం.'అని ఎయిడెన్ మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు. వరుసగా రెండు పరాజయాలతో ఇంగ్లండ్‌ సెమీస్ రేసు నుంచి తప్పుకోగా.. సౌతాఫ్రికా సెమీస్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినా.. తక్కువ మార్జిన్‌తో ఓడినా సౌతాఫ్రికా సెమీస్ చేరుతోంది. చిత్తుగా ఓడితే మాత్రం అఫ్గాన్‌కు అవకాశం దక్కుతుంది.

తుది జట్లు:
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్(కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

సౌతాఫ్రికా : ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి

Story first published: Saturday, March 1, 2025, 14:35 [IST]
Other articles published on Mar 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+