
అదో విలాసవంతమైన జైలు
దాదాపు రెండు నెలల పాటు బయో బుడగలో ఉన్న కాగిసో రబాడ తన అనుభవాలు పంచుకున్నాడు. 'బయో బుడగలో ఉండటం కష్టతరమే. ఎక్కువ మందిని కలవలేరు. మీ స్వేచ్ఛని కోల్పోతారు. అదో విలాసవంతమైన జైలులా ఉంటుంది. అయితే అది మా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే.. ఎంతో మంది ప్రజలు కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. కానీ మేం ఇష్టమైన పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాం. గొప్ప అవకాశం ఇది' అని రబాడ అన్నాడు. ఐపీఎల్ 2020లో రబాడ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

నాలుగు గోడల మధ్యలో ఉండటం
'సౌకర్యవంతమైన హోటల్లో, రుచికరమైన ఆహారాన్ని తీసుకున్నాం. కానీ నాలుగు గోడల మధ్యలో ఉండటం మానసికంగా కాస్త ఇబ్బందికి గురి చేసింది. అయితే ఆటను ప్రారంభించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సమయాన్ని గొప్పగా ఆస్వాదించాం. ఐపీఎల్‌కు ఎంతో స్టార్‌డమ్ ఉంది' అని దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కాగిసో రబాడ తెలిపాడు. ఐపీఎల్ 2020 అనంతరం స్వదేశానికి చేరుకున్న రబాడ.. ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20ల సిరీస్‌కు క్వారంటైన్‌లో ఉంటూ సన్నద్ధమవుతున్నాడు.

రిఫ్రెష్ అయింది
ఐపీఎల్ 2020కి ముందు కాగిసో రబాడ దాదాపు ఆరు నెలలు ఎటువంటి క్రికెట్ ఆడలేదు. 'ఈ విరామం శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి బాగా ఉపయోగపడింది. చాలా విషయాల నుంచి మనస్సు తేలిగ్గా ఉండడానికి సహాయపడింది. క్రికెట్ మొదలైంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి విరామాలు వస్తాయో లేదో నాకు తెలియదు' అని రబాడ సరదాగా అన్నాడు. నవంబరు 27 నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దక్షిణాఫ్రికా గడ్డపైకి చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు.. కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టింది.
ఆస్ట్రేలియాలోనే ఉండి.. నాన్న కలను నెరవేర్చు: సిరాజ్ తల్లి భావోద్వేగం


Click it and Unblock the Notifications












