For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాలోనే ఉండి.. నాన్న కలను నెరవేర్చు: సిరాజ్‌ తల్లి భావోద్వేగం

Stay back in Australia and fulfill fathers dream: Mohammed Siraj reveals his Mother words

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టు కసరత్తులు చేస్తున్న సమయం అది!!. సీనియర్‌ బౌలర్ మహమ్మద్‌ షమీతో కలిసి యువ పేసర్ నెట్స్‌లో బంతులు విసురుతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయిన విరాట్‌ కోహ్లీ లాంటి ఆటగాడిని తన పదునైన బంతులతో ఇబ్బంది పెడుతున్నాడు. ఆ సమయంలో ఓ చేదు వార్త ఆ కుర్రాడికి అతడికి చేరింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తండ్రి కన్నుమూశారని తెలియగానే అక్కడే కుప్పకూలాడు.

వెంటనే అప్రమత్తమైన బీసీసీఐ అతడిని స్వదేశానికి పంపేందుకు పూర్తి ఏర్పాట్లు చేసింది. కానీ ఆ కుర్రాడు తండ్రిని చివరిసారి చూసేందుకు రాలేదు. తండ్రిని కడసారి చూడటం కంటే.. జట్టుతో ఉండి మంచి ప్రదర్శన చేయడమే తన కర్తవ్యమని నిర్ణయించుకున్నాడు. అతడే హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌.

అందరి మనసులు గెలుచుకో

అందరి మనసులు గెలుచుకో

మహమ్మద్‌ సిరాజ్ అన్న మాటలతో కదిలిపోయిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అతడి వ్యక్తిత్వాన్ని కొనియాడితే.. గడ్డు పరిస్థితులే నీలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తెస్తాయి అని విరాట్‌ కోహ్లీ భరోసానిచ్చాడు. మరోవైపు సిరాజ్‌తో అతడి తల్లి మాట్లాడుతూ భావోద్వేగం చెందారు. 'నువ్వు దేశానికి ఆడాలనేది నీ తండ్రి కల. దాన్ని నిర్వర్తించడమే నీ ముందున్న కర్తవ్యం. చక్కటి ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకో' అని తన తల్లి అన్నట్లు సిరాజ్ తెలిపాడు. ఆస్ట్రేలియాలోనే ఉండి.. నాన్న కలను నెరవేర్చు అని తన తల్లి చెప్పినట్టు బీసీసీఐ.టీవీతో సిరాజ్‌ మాట్లాడుతూ అన్నాడు.

కోహ్లీ మాటలే స్ఫూర్తి

కోహ్లీ మాటలే స్ఫూర్తి

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ధైర్యం చెప్పాడని మహమ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. 'నాన్న మరణం నాకు తీరని లోటు. తీవ్ర బాధలో ఉన్న నన్ను విరాట్ భాయ్ ఓదార్చాడు. "సోదరా.. ఆందోళన వద్దు. ధైర్యంగా ఉండు. నువ్వు భారత్‌కు ఆడాలన్నది మీ నాన్న కోరిక. ఆ పని చెయ్‌. అనవసరంగా ఒత్తిడి పెంచుకోకు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దృఢంగా ఉంటే నువ్వు మరింతగా రాటుదేలుతావు" అని కోహ్లీ ధైర్యం చెప్పాడు. కెప్టెన్‌ మాటలు నాలో స్ఫూర్తి నింపాయి' అని సిరాజ్‌ తెలిపాడు. 2007లో ఢిల్లీ తరఫున రంజీట్రోఫీ మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు కోహ్లీ తన తండ్రిని కోల్పోయాడు. అయినా తర్వాతి రోజు మైదానంలో అడుగుపెట్టిన విరాట్ 97 పరుగులు సాధించాడు.

కంగారూల వికెట్లు పడగొట్టేందుకు సిద్ధం

కంగారూల వికెట్లు పడగొట్టేందుకు సిద్ధం

'మేరా బేటా దేశ్‌కా నామ్‌ రోషన్‌ కరేగా' (నా కొడుకు దేశాన్ని గర్వించేలా చేస్తాడు) అని తరచూ చెప్పే తండ్రి మాటలను మనసులో బలంగా ముద్రించుకున్న మహమ్మద్‌ సిరాజ్‌.. తండ్రిని కడసారి చూడటం కంటే జట్టుతో ఉండి మంచి ప్రదర్శన చేయడమే తన కర్తవ్యమని నిర్ణయించుకున్నాడు. ఇక కెప్టెన్ ఇచ్చిన స్పూర్తితో కంగారూల వికెట్లు పడగొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆటో రిక్షా నడుపుతూ రెక్కలు ముక్కలు చేసుకొని తనను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన తండ్రికి విజయాల రూపంలో నివాళి అర్పించాలని ప్రాక్టీస్‌పై మనసుపెట్టాడు.

Story first published: Tuesday, November 24, 2020, 8:09 [IST]
Other articles published on Nov 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+