For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs ENG: సన్‌రైజర్స్ బ్యాటర్ విధ్వంసం.. సౌతాఫ్రికా ఘన విజయం!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లండ్ ప్రస్తానం విజయం లేకుండానే ముగిసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన ఇంగ్లీష్ టీమ్.. సౌతాఫ్రికాతో శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో చెలరేగిన సౌతాఫ్రికా ఐదు పాయింట్లతో గ్రూప్-బీ టాపర్‌గా సగర్వంగా సెమీస్‌ చేరింది. బౌలింగ్‌లో మార్కో జాన్సెన్, వియాన్ మల్డర్ నిప్పులు చెరిగితే.. బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రాస్ వాన్ డెర్ డస్సెన్ సత్తా చాటారు.

మార్కో,మల్డర్ తీన్మార్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 38.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 38.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్స్(3/39), వియాన్ మల్డర్(3/25)లు మూడేసి వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్(2/35) రెండు వికెట్లు పడగొట్టాడు. లుంగి ఎంగిడి, కగిసో రబడా తలో వికెట్ తీసారు.

SA vs ENG Heinrich Klaasen and Rassie van der Dussen helps South Africa beat England in CT 2025

అనంతరం సౌతాఫ్రికా ఓవర్లలో 2 వికెట్లకు పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(27), ట్రిస్టన్ స్టబ్స్(0) విఫలమైనా.. రాసీ వాన్ డెర్ డస్సెన్(87 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్), హెన్రీచ్ క్లాసెన్(56 బంతుల్లో 11 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఒక్కడే 2 వికెట్లు తీసాడు.

క్లాసెన్ కాక విధ్వంసం
లక్ష్యచేధనలో సౌతాఫ్రికా ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ విఫలమైనా.. రాసీ వన్ డెర్ డస్సెన్, హెన్రీచ్ క్లాసెన్ ఆచితూచి ఆడి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఈ జోడీ.. ఆ తర్వాత స్వేచ్చగా బౌండరీలు బాదింది. హెన్రీచ్ క్లాసెన్ తనదైన షాట్లతో వేగంగా పరుగులు చేశాడు. దాంతో అతను 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కాసేపటికే వాన్‌డెర్ డస్సెన్ కూడా 72 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. విజయం ముంగిట హెన్రీచ్ క్లాసెన్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ సిక్సర్‌తో సౌతాఫ్రికా విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

సంతోషంలో SRH ఫ్యాన్స్
గాయంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన హెన్రీచ్ క్లాసెన్.. కీలక మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అతని బ్యాటింగ్ ప్రదర్శనపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హెన్రీచ్ క్లాసెన్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 23 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు రాసీ వన్ డెర్ డస్సెన్‌ను రాజస్థాన్ రాయల్స్ కోటీ రూపాయలకు వేలంలో కొనుగోలు చేసింది.

Story first published: Saturday, March 1, 2025, 20:22 [IST]
Other articles published on Mar 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+