Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs BAN: చెలరేగిన కేశవ్ మహరాజ్.. 53 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్! సౌతాఫ్రికా ఘన విజయం!

SA vs BAN: South Africa Register Massive 220-Run Win in 1st Test against Bangladesh

డర్బన్: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. తొలి టెస్ట్‌లో కేశవ్ మహరాజ్ తన స్పిన్ మాయజాలం చూపించడంతో 220 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం నిలిచింది. ఐపీఎల్ 2022 సీజన్ కోసం స్టార్ ఆటగాళ్లంతా భారత్ వెళ్లినా.. సౌతాఫ్రికా తమ ఆటలో తగ్గేదేలే అన్నట్లు చెలరేగింది.

274 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. కేశవ్ మహరాజ్(7/32) ధాటికి 53 పరుగులకే కుప్పకూలింది. అతనికి తోడుగా సీమోన్ హార్మర్ మూడు వికెట్లు తీసాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాట్స్‌మన్ పరుగుల ఖాతా తెరవకపోవడం విశేషం. నజ్ముల్ హుస్సెన్(26), టస్కిన్ అహ్మద్(14) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లొ 367 పరుగులకు కుప్పకూలింది. టెంబా బవుమా(93)తో పాటు డీన్ ఎల్గర్(67) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు కుప్పకూలింది.

ఓపెనర్ మహముదుల్ హసన్ జయ్(137) సెంచరీతో రాణించగా.. కీపర్ లిటన్ దాస్(41) విలువైన పరుగులు చేశాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు కుప్పకూలింది. మరోసారి డీన్ ఎల్గర్(64) హాఫ్ సెంచరీతో రాణించగా.. ర్యాన్ రికెల్టన్(39 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు.

Story first published: Monday, April 4, 2022, 15:54 [IST]
Other articles published on Apr 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+