Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AUS: కొంపముంచిన కంకషన్ సబ్‌స్టిట్యూట్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన సౌతాఫ్రికా

బ్లోమ్‌ఫోంటెయిన్: సౌతాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ మార్నస్ లబుషేన్(93 బంతుల్లో 8 ఫోర్లతో 80 నాటౌట్), అష్టన్ అగర్(69 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 48) అసాధారణ బ్యాటింగ్‌తో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఓటమి అంచున నిలిచిన ఆసీస్‌ను లబుషేన్-అగర్ 112 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఆదుకొని చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49 ఓవర్లలో 222 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ టెంబా బవుమా(142 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 114 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. మార్కో జాన్సెన్(32) విలువైన పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

SA vs AUS: Concussion substitute Marnus Labuschagne helps Australias 3-Wicket Win in 1st ODI

ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/41) మూడు వికెట్లు తీయగా.. మార్కో స్టోయినిస్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్, అష్టన్ అగర్, ఆడమ్ జంపా, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా సఫారీ బౌలర్ల ధాటికి 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కట్టడైన బౌలింగ్‌కు ఆసీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. డేవిడ్ వార్నర్(0) డకౌటవ్వగా.. మిచెల్ మార్ష్(17), జోష్ ఇంగ్లీస్, అలెక్స్ క్యారీ, మార్కస్ స్టోయినీస్(17), సీన్ అబాట్(9) దారుణంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్(0) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

దాంతో ఆసీస్‌కు పరాజయం తప్పదని అంతా భావించారు. తీవ్రంగా గాయపడిన కామెరూన్ గ్రీన్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన మార్నస్ లబుషేన్.. అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు ఓటమిని తప్పించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను అష్టన్ అగర్‌తో కలిసి అసలు సిసలు వన్డే బ్యాటింగ్ చేశాడు.

చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండటంతో పాటు ఓవర్లు చాలా ఉండటంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టాడు. దాంతో విజయం ఖాయం అనుకున్న సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. కెప్టెన్ టెంబా బవుమా సెంచరీ పోరాటం వృథా అయ్యింది. మార్నస్ లబుషేన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావడం సౌతాఫ్రికా విజయవకాశాలను దెబ్బతీసింది.

ఆసీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లోనే తీవ్రంగా గాయపడిన కామెరూన్ గ్రీన్ స్థానంలో లబుషేన్ వచ్చినా.. వ్యూహాత్మకంగా 8వ స్థానంలో బ్యాటింగ్ పంపారు. క్రికెటర్ల తలకు బలమైన గాయమైనప్పుడు అతని సామర్థ్యానికి సరిపడే ఆటగాడిని సబ్‌స్టిట్యూట్‌గా ఆడించడమే కంకషన్ సబ్‌స్టిట్యూడ్.

Story first published: Friday, September 8, 2023, 8:14 [IST]
Other articles published on Sep 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+