Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AUS: నిప్పులు చెరిగిన రబడా.. ఆసీస్ విల విల!

బ్లోమ్‌ఫోంటెయిన్: సౌతాఫ్రికా పర్యటనలో మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది. తొలి వన్డేలో ఓటమికి మూడు వికెట్ల దూరంలో నిలిచింది. సౌతాఫ్రికా పేసర్లు కగిసో రబడా(2/33), గేరాల్డ్(2/35) రఫ్పాడించడంతో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49 ఓవర్లలో 222 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ టెంబా బవుమా(142 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 114 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. మార్కో జాన్సెన్(32) విలువైన పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

Australia Chase 223-Run Target after Temba Bavuma slams his fifth ODI century

ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/41) మూడు వికెట్లు తీయగా.. మార్కో స్టోయినిస్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్, అష్టన్ అగర్, ఆడమ్ జంపా, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. సఫారీ పేసర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. డేవిడ్ వార్నర్(0) డకౌటవ్వగా.. మిచెల్ మార్ష్(17), జోష్ ఇంగ్లీస్, అలెక్స్ క్యారీ, మార్కస్ స్టోయినీస్(17), సీన్ అబాట్(9) దారుణంగా విఫలమయ్యారు.

Australia Chase 223-Run Target after Temba Bavuma slams his fifth ODI century

కామెరూన్ గ్రీన్(0) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో మార్నస్ లబుషేన్(45 బ్యాటింగ్), అష్టన్ అగర్(20 బ్యాటింగ్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 23 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 27 ఓవర్లలో 67 పరుగులు కావాలి.

Story first published: Thursday, September 7, 2023, 22:46 [IST]
Other articles published on Sep 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+