Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AUS 2nd semi final: పాపం సౌతాఫ్రికా.. ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా!

SA vs AUS 2nd semi final: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా ఆరోసారి ఫైనల్‌కు చేరింది. గురువారం సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన రెండో సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

విజయం కోసం చివరి వరకు పోరాడిన సౌతాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. దాంతో మరోసారి ఆ జట్టు నాకౌట్‌ పోరులోనే వెనుదిరిగి చోకర్స్ అనే తమ పేరును నిలబెట్టుకుంది. క్యాచ్‌లు నేలపాలు చేయడం సౌతాఫ్రికా కొంపముంచింది.

SA vs AUS 2nd semi final: India vs Australia in final after South Africa lose thriller

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్(116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) ఒక్కడే సెంచరీతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ మూడేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, ట్రావిస్ హెడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

SA vs AUS 2nd semi final: India vs Australia in final after South Africa lose thriller

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్(48 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. జోష్ ఇంగ్లీస్, స్మిత్(30) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో టబ్రైజ్ షంసీ(2/42) రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా, ఎయిడెన్ మార్క్‌రమ్, గెరాల్డ్ కోయిట్జీ, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు.

ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో భారత్‌, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

అదిరిపోయే ఆరంభం..
213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్(29) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే సఫారీ బౌలర్లపై వార్నర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 60 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మార్క్‌రమ్ విడదీసాడు. వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్(0)ను రబడా డకౌట్ చేయగా.. స్మిత్‌తో కలిసి ట్రావిస్ హెడ్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్.. ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ కేశవ్ మహరాజ్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేయడంతో మూడో వికెట్‌కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

SA vs AUS 2nd semi final: India vs Australia in final after South Africa lose thriller

మార్నస్ లబుషేన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌లను షంసీ ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. జిడ్డుగా బ్యాటింగ్ చేసిన స్మిత్.. చివరకు చెత్త షాట్‌తో వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్(6)తో జోష్ ఇంగ్లీస్ జట్టును విజయం వైపు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ కోయిట్జీ అతన్ని క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(14 నాటౌట్), మిచెల్ స్టార్క్(17 నాటౌట్) ఆచితూచి ఆడి విజయ లాంఛనాన్ని పూర్తి చేసారు.

Story first published: Thursday, November 16, 2023, 22:19 [IST]
Other articles published on Nov 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+