Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AUS 2nd semi final: డేవిడ్ మిల్లర్ ‘సెంచరీ’ పోరాటం.. ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యం!

SA vs AUS 2nd semi final: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్ల రఫ్ఫాడించడంతో వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. డేవిడ్ మిల్లర్(116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) ఒక్కడే సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.

దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు కుప్పకూలింది. మిల్లర్‌కు తోడుగా హెన్రీచ్ క్లాసెన్(48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ మూడేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, ట్రావిస్ హెడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

SA vs AUS 2nd semi final: David Miller’s gritty ton pushes SA to 212

నిప్పులు చెరిగిన స్టార్క్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లోనే కెప్టెన్ టెంబా బవుమా(0) డకౌటవ్వగా.. ఆచితూచి ఆడే ప్రయత్నం చేసిన క్వింటన్ డికాక్(3)ను హజెల్ వుడ్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్‌రమ్(10)ను మిచెల్ స్టార్క్ పెవిలియన్ చేర్చగా.. రాసీ వాన్ డెర్ డస్సెన్(6)‌ను హజెల్ వుడ్ ఔట్ చేశాడు.

SA vs AUS 2nd semi final: David Miller’s gritty ton pushes SA to 212

24 రన్స్‌కే 4 వికెట్లు: దాంతో సౌతాఫ్రికా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, హెన్రీచ్ క్లాసెన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 14 ఓవర్లలో 44 పరుగులు చేసినంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. కాసేపటి తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమవ్వగా.. క్లాసెన్, మిల్లర్ ఆచితూచి ఆడారు.

SA vs AUS 2nd semi final: David Miller’s gritty ton pushes SA to 212

ఆదుకున్న క్లాసెన్, మిల్లర్: హాఫ్ సెంచరీకి చేరువైన హెన్రీచ్ క్లాసెన్(47)ను ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి బంతికే మార్కో జాన్సెన్(0) ట్రావిస్ హెడ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కోయిట్జీ సాయంతో 70 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేశాడు.

ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకుంటూ వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. కోయిట్జీ కూడా అతనికి సహకారం అందించారు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కమిన్స్ విడదీసాడు. తమ సహనానికి పరీక్షగా నిలిచిన కోయిట్జీని కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఏడో వికెట్‌కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

SA vs AUS 2nd semi final: David Miller’s gritty ton pushes SA to 212

మిల్లర్ ఫైటింగ్ సెంచరీ: అనంతరం క్రీజులోకి వచ్చిన కేశవ్ మహరాజ్(4) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు భారీ సిక్సర్లతో విరుచుకుపడిన డేవిడ్ మిల్లర్ 115 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో మరుసటి బంతికే భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రబడా ఒక్క సిక్సర్ బాది క్యాచ్ ఔటయ్యాడు.

Story first published: Thursday, November 16, 2023, 18:32 [IST]
Other articles published on Nov 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+