For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs AFG: ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది: సౌతాఫ్రికా కెప్టెన్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తమ విజయానికి కలిసొచ్చిందని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నాడు. పిచ్ కండిషన్స్‌‌పై అవగాహన లేకుండానే బ్యాటింగ్ ఎంచుకున్నానని తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం కరాచీ వేదికగా ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 107 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన టెంబా బవుమా సమష్టిగా రాణించి విజయాన్నందుకున్నామని తెలిపాడు.

'ఇది మా సమష్టి విజయం. పిచ్ కండిషన్స్‌పై అవగాహన లేకున్నా మేం ముందుగా బ్యాటింగ్‌ చేయాలనే సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం. బంతితో అసాధారణ ప్రదర్శన కనబర్చాం. ఇది మా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా నిలుస్తోంది. పాకిస్థాన్‌లో తరుచూ కనిపించే పిచ్‌ల కంటే ఈ వికెట్ చాలా భిన్నంగా ఉంది.

SA vs AFG Temba Bavuma Says Clinical performance after South Africa Beat Afghanistan In Champions Trophy 2025

బ్యాటర్లు అద్భుతమై ప్రదర్శనతో భారీ స్కోర్ అందించారు. పిచ్‌పై చాలా క్రాక్స్ ఉండటంతో అనూహ్య బౌన్స్ ఉంటుందని, బంతి ఆగుతూ వస్తుందని మేం ముందే ఊహించాం. అందుకు తగ్గట్లుగానే మా బౌలర్లు సరైన లెంగ్త్‌ల్లో బంతిని హిట్ చేసి ఫలితాన్ని రాబట్టారు. ఆస్ట్రేలియాతోనూ మేం ఇలాంటి ప్రదర్శననే కనబర్చాలనుకుంటున్నాం.'అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 315 పరుగుల భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్(106 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 103) సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా(76 బంతుల్లో 5 ఫోర్లతో 58), రాసీ వాన్ డెర్ డస్సెన్(46 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52), ఎయిడెన్ మార్క్‌రమ్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

అఫ్గానిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ(2/51) రెండు వికెట్లు తీయగా.. ఫజలక్ ఫరూఖీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలో వికెట్ తీసారు. అనంతరం అఫ్గానిస్థాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. కగిసో రబడా(3/36) మూడు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి(2/56), వియాన్ మల్డర్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా(92 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 90) మినహా మరెవరూ రాణించలేదు.

Story first published: Saturday, February 22, 2025, 7:10 [IST]
Other articles published on Feb 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+