SA vs AFG: రఫ్ఫాడించిన రబడా.. సౌతాఫ్రికా ఘన విజయం!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. గ్రూప్-బీలో అఫ్గానిస్థాన్‌తో శుక్రవారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 107 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ర్యాన్ రికెల్టన్ బ్యాట్‌తో.. కగిసో రబడా(3/36) బంతితో చెలరేగడంతో సౌతాఫ్రికా సునాయస విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 315 పరుగుల భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్(106 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 103) సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా(76 బంతుల్లో 5 ఫోర్లతో 58), రాసీ వాన్ డెర్ డస్సెన్(46 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52), ఎయిడెన్ మార్క్‌రమ్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

అఫ్గానిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ(2/51) రెండు వికెట్లు తీయగా.. ఫజలక్ ఫరూఖీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలో వికెట్ తీసారు. అనంతరం అఫ్గానిస్థాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. కగిసో రబడా(3/36) మూడు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి(2/56), వియాన్ మల్డర్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు.
అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా(92 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 90) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. రెహ్మనుల్లా గుర్బాజ్(10), ఇబ్రహీమ్ జడ్రాన్(17), అతల్(16), హష్మతుల్లా షాహిది(0), అజ్మతుల్లా ఒమర్జాయ్(18), మహమ్మద్ నబీ(8), గుల్బాదిన్ నబీ(13), రషీద్ ఖాన్(18), నూర్ అహ్మద్(9) తీవ్రంగా నిరాశపరిచారు. ఓవైపు వికెట్లు పడుతున్నా రెహ్మత్ షా ఒంటరి పోరాటం చేశాడు.
అతని సూపర్ బ్యాటింగ్‌తోనే అఫ్గాన్ 208 పరుగులు చేయగలిగింది. రెహ్మత్ షాకు మరో ఎండ్ సహకారం లభించలేదు. ఒక్క బ్యాటర్ అండగా నిలిచినా.. సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు లక్ష్యాన్ని దగ్గరగా తీసుకువెళ్లేవాడు. అతనే ఆఖరి వికెట్‌గా ఔటవ్వడం విశేషం. ఈ గెలుపుతో సౌతాఫ్రికా గ్రూప్-బీ టాపర్‌గా నిలిచింది. భారీ విజయం ఆ జట్టు రన్‌రేట్‌ను మెరుగుపరిచింది. సౌతాఫ్రికా తమ తుదపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఫిబ్రవరి 26న అఫ్గానిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications