For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs BAN: ఇదేం బ్యాటింగ్ రా అయ్యా.. పాపం బంగ్లాదేశ్!

SA vs BAN: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు దుమ్మురేపారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ క్వింటన్ డికాక్(140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174) సెంచరీతో పరుగుల సునామీ సృష్టించగా.. హెన్రీచ్ క్లాసెన్(48 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 ) ఊర మాస్ బ్యాటింగ్‌తో అలరించాడు.

దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇద్దరి విధ్వంసానికి తోడుగా ఎయిడెన్ మార్క్‌రమ్(69 బంతుల్లో 7 ఫోర్లతో 60), డేవిడ్ మిల్లర్(15 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహముద్ రెండు వికెట్లు తీయగా.. మెహ్‌దీ హసన్ మీరాజ్, షోరిఫుల్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ తీసారు.

ఈ టోర్నీలో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన ఒక్క మ్యాచ్ తప్పా సౌతాఫ్రికా.. ప్రతీ మ్యాచ్‌లో 300 ప్లస్ పరుగుల చేయడం విశేషం. శ్రీలంకతో తొలి మ్యాచ్‌లో 428 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో 311, ఇంగ్లండ్‌తో 399, బంగ్లాదేశ్‌తో 382 పరుగులు చేసింది. ఒక్క నెదర్లాండ్స్‌తో మాత్రమే చేజింగ్‌లో 207 రన్స్ చేసి ఓటమిపాలైంది. సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటింగ్ చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. ఇదేం బ్యాటింగ్ రా అయ్యా? అని సెటైర్లు పేల్చుతున్నారు.

SA vs AFG: Henrich Klasen and Quinton de kock help South Africa post 382/5 vs Bangladesh in CWC 2023

శుభారంభం లేకున్నా..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రీజా హెండ్రీక్స్(12)ను షోరిఫుల్ ఇస్లామ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే రాసీ వాన్ డెర్ డస్సెన్(1) హసన్ మీరాజ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులే చేసింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌తో కలిసి క్వింటన్ డికాక్ చెలరేగాడు.

డికాక్ సునామీ ఇన్నింగ్స్..
47 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న అతను అనంతరం మరింత ధాటిగా ఆడాడు. మరోవైపు మార్క్‌రమ్ కూడా 57 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన డికాక్ 101 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎయిడెన్ మార్క్‌రమ్(60)ను షకీబ్ అల్ హసన్ ఔట్ చేసినా.. హెన్రీచ్ క్లాసెన్‌తో కలిసి క్వింటన్ డికాక్ చెలరేగాడు.

క్లాసెన్ ఊర మాస్ బ్యాటింగ్..
క్లాసెన్ కూడా భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా స్కోర్ బోర్డు పరుగెత్తింది. 129 బంతుల్లో 150 పరుగులు చేసిన డికాక్ డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్లగా.. క్లాసెన్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి సెంచరీపై ఆశలు రేకెత్తించాడు. ఇక డికాక్‌ను హసన్ మహముద్ క్యాచ్ ఔట్ చేసి డబుల్ సెంచరీని అడ్డుకున్నాడు.

క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ సైతం ధాటిగా ఆడగా.. క్లాసెన్ ఆఖరి ఓవర్‌లో భారీ సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకునేలా కనిపించాడు. కానీ హసన్ మహముద్ వేసిన మరుసటి బంతికి భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో సౌతాఫ్రికా 400 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయింది.

Story first published: Tuesday, October 24, 2023, 17:57 [IST]
Other articles published on Oct 24, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+