Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: కగిసో రబడా చెత్త రికార్డు.!

 SA Pacer Kagiso Rabada Worst Record: 17 No Balls Bowled Against India

సెంచూరియన్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా చెత్త రికార్డు నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన సౌతాఫ్రికా బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 11 నోబాల్స్ వేసిన రబడా.. రెండో ఇన్నింగ్స్‌లో మరో నో బాల్స్ వేసాడు. దాంతో ఓ మ్యాచ్‌లో మొత్తం 17 నోబాల్స్ వేసిన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ షాన్ పొలాక్ చెత్త రికార్డును రబడా సమం చేశాడు.

1997/98లో శ్రీలంకతో కేప్ టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పొలాక్ 17 నో బాల్స్ వేసాడు. 1998లో ఇంగ్లండ్‌తో నాటింగ్‌హోమ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ పొలాక్ మరోసారి 17 నోబాల్స్ వేసాడు. ఆ తర్వాత రబడా తాజా మ్యాచ్‌లో 17 నోబాల్స్ వేసి ఈ చెత్త రికార్డు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. రబడా తర్వాత డేల్ స్టేయిన్ 16 నోబాల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ స్టెయిన్ ఈ నోబాల్స్ వేసాడు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో రబడా మరిన్నీ నో బాల్స్ వేసాడని, కానీ అంపైర్లు గుర్తించలేదని భారత అభిమానులు ఆరోపించారు. శార్దూల్ ఠాకూర్ ఔటైన బంతి కూడా నో బాలేనని, థర్డ్ అంపైర్, ఫీల్డ్ అంపైర్లు నిద్రపోయారని విమర్శిస్తున్నారు. టీవీ రిప్లేలో రబడా లైన్ క్రాస్ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్లు పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ విజయానికి 9 వికెట్ల దూరంలో ఉంది. 16/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 174 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 130 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఆథిత్య జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక భారత ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్(34 బంతుల్లో 6 ఫోర్లతో 34), అజింక్యా రహానే(23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20), కేఎల్ రాహుల్(74 బంతుల్లో 4 ఫోర్లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ధాటిగా ఆడే క్రమంలో భారత బ్యాట్స్‌మన్ వికెట్లు ఇచ్చుకున్నారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(4/42), మార్కో జాన్సెన్(4/55) నాలుగేసి వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు.

305 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 22 రన్స్ చేసింది. క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గర్(9 బ్యాటింగ్), కేగన్ పీటర్సన్(12 బ్యాటింగ్) ఉన్నారు. మహమ్మద్ షమీ సూపర్ బాల్‌కు సఫారీ ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ తరహాలోనే షమీ సూపర్ బాల్‌కు బిత్తరపోయాడు.

Story first published: Wednesday, December 29, 2021, 18:56 [IST]
Other articles published on Dec 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+