Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీరు మనుషులేనా.. వ్యూస్ కోసం ఇంత కక్కుర్తా? శ్రీశాంత్ సతీమణి ఫైర్!

ఐపీఎల్ మాజీ ఛైర్మెన్ లలిత్ మోదీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్‌లపై భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సతీమణి భువనేశ్వరి కుమారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీరు మనుషులేనా.. వ్యూస్ కోసం ఇంత దిగజారుతారా?'అని మండిపడింది. ఐపీఎల్ అరంగేట్ర సీజన్(2008)లో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనకు సంబంధించిన వీడియోను లలిత్ మోదీ తాజాగా మైఖేల్ క్లార్క్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రిలీజ్ చేశాడు.

ఈ ఇంటర్వ్యూ ద్వారా శ్రీశాంత్‌పై హర్భజన్ సింగ్ చేయి చేసుకున్న ఫుటేజిని 17 ఏళ్ల తర్వాత వెలుగులోకి తీసుకొచ్చారు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచిన వీడియోను తాజాగా విడుదల చేయడంతో వైరల్‌గా మారింది. శ్రీశాంత్‌ చెంపపై హర్భజన్ సింగ్ కొట్టడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మరిచిపోయిన ఘటనను మళ్లీ గుర్తు చేయాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నిస్తూ.. శ్రీశాంత్ సతీమణి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది.

S Sreesanth s Wife Slams Lalit Modi for Releasing Slapgate Video Calls It Disgusting Heartless and Inhuman

'లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్ మీరు చేసిన పనికి సిగ్గు పడండి. 17 ఏళ్ల నాటి పాత ఘటనకు సంబంధించిన వీడియోను కేవలం వ్యూస్, పబ్లిసిటీ కోసం మళ్లీ వెలుగులోకి తీసుకురావడం సిగ్గు చేటు. ఇప్పటికే హర్భజన్ సింగ్, శ్రీశాంత్ ఇద్దరూ ఈ సంఘటనను మరిచిపోయి ముందుకు సాగారు. ఇప్పుడు వారికి స్కూల్‌కు వెళ్లే పిల్లలు కూడా ఉన్నారు. కానీ మీరు ఆ పాత గాయాన్ని మళ్లీ రేపుతున్నారు. ఇదేం పద్దతి? ఇది ముమ్మాటికి హృదయం లేని, అసహ్యకరమైన చర్య.

మీరు చేసిన ఈ పని శ్రీశాంత్, హర్భజన్ సింగ్‌లపై మాత్రమే కాకుండా వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వారి పిల్లలు సూల్స్‌లో అవమానాలను ఎదుర్కోవాల్సిని పరిస్థితి ఏర్పడింది. మీ కారణంగా చేయని తప్పుకు ఆ పసి పిల్లలు శిక్షను అనుభవించాలా? ఇంత చౌక బారుగా, అమానవీయంగా వ్యవహరించినందుకు మీపై కేసు పెట్టాలి. శ్రీశాంత్ గొప్ప వ్యక్తి. పట్టుదల, మానసిక దృఢత్వం ఉన్న మనిషి. ఇలాంటి వీడియోలు అతని గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించలేవు.'అని భువనేశ్వరి కుమారి ఇన్‌స్టా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.

Story first published: Saturday, August 30, 2025, 11:34 [IST]
Other articles published on Aug 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+