Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sreesanth: భారత క్రికెట్‌కు వివాదాస్పద బౌలర్ గుడ్‌బై.. ఎందుకంటే?

S Sreesanth Open To Playing In Overseas Leagues After Retiring From Indian domestic cricket

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేసర్, వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల దేశవాళీ ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణానికి సంబంధించి 2020లో నిషేధం పూర్తి చేసుకున్న శ్రీశాంత్‌.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. అతడు చివరిసారి గత నెలలో కేరళ, మేఘాలయ మధ్య రంజీ మ్యాచ్‌లో ఆడాడు. రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇదే సరైన సమయం..

ఇదే సరైన సమయం..

39 ఏళ్ల శ్రీశాంత్‌ తన రిటైర్మెంట్‌ను ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. 'దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. కానీ భారమైన హృదయంతో భారత దేశవాళీ క్రికెట్‌ (ఫస్ట్‌క్లాస్‌, అన్ని ఫార్మాట్ల నుంచి) నుంచి రిటైవుతున్నా. బాధగా ఉంది. కానీ పశ్చాత్తాపం లేదు. వచ్చే తరం క్రికెటర్ల కోసం ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నా. ఇది నేను తీసుకున్న నిర్ణయమే. ఇది నాకు సంతోషాన్నివ్వదని తెలిసినా.. నా జీవితంలో ఈ సమయంలో ఇది గౌరవప్రదమైన నిర్ణయమే'అని చెప్పాడు.

ప్రపంచకప్ విజేత..

ప్రపంచకప్ విజేత..

భారత జట్టు తరఫున శ్రీశాంత్‌ 27 టెస్టుల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు పడగొట్టాడు. అలాగే, 10 టీ20 మ్యాచుల్లో 7 వికెట్లు, ఐపీఎల్‌లో 40 మ్యాచుల్లో 44 వికెట్లు తీశాడు. 2006లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌తో శ్రీశాంత్‌ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. 2011లో మహేంద్ర సింగ్‌ ధోని నాయకత్వంలో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోనూ శ్రీశాంత్‌ ఉన్నాడు.

స్పాట్ ఫిక్సింగ్‌తో..

స్పాట్ ఫిక్సింగ్‌తో..

ఐపీఎల్ 2013 సీజన్ సందర్భంగా శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రాగా.. బీసీసీఐ అతనిపై జీవితాంతం నిషేధం విధించింది. దీనిపై న్యాయ పోరాటానికి దిగిన శ్రీశాంత్.. చివరకు తనపై బోర్డు వేసిన నిషేదాన్ని తగ్గించుకున్నాడు. రెండేళ్ల క్రితమే ఈ నిషఏధం పూర్తవ్వగా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా శ్రీశాంత్ సన్నదమయ్యాడు. కానీ అనుకున్నది సాధించలేకపోయాడు. కనీసం ఐపీఎల్‌లో అయినా ఆడాలని భావించిన అతనికి నిరాశే ఎదురైంది. వరుసగా రెండు సీజన్ల వేలంలో రూ.50 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్న అతన్ని ఫ్రాంచైజీలు తీసుకోలేదు.

విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే..

విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే..

ఈ క్రమంలోనే భారత క్రికెట్‌కు గుడ్ బై చెప్పి విదేశీ లీగ్స్ ఆడాలని శ్రీశాంత్ నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడటానికి వీలు లేదన్న విషయం తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే శ్రీశాంత్ బీబీఎల్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ల్లో కనిపించనున్నాడు.

Story first published: Thursday, March 10, 2022, 9:52 [IST]
Other articles published on Mar 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+