For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాలో చోటు దక్కాలంటే.. బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకోవాలి: సీఎస్‌కే మాజీ ప్లేయర్

శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జట్ల ఎంపికపై భారత మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్‌లను ఎంపిక చేయకపోవడంపో సోషల్ మీడియా వేదికగా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురిని ఎందుకు తప్పించారో తనకు అర్థం కావడం లేదని కామెంట్ చేశాడు.

తాజాగా రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనపెట్టడంపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు ఎస్. బద్రీనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా రాణిస్తున్నా అతన్ని ఎంపికచేయకపోవడంపై మండిపడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్.. శ్రీలంక పర్యటనకు ఎంపికవ్వకపోవడం షాక్‌కు గురిచేసిందన్నాడు.

S Badrinath says You need to be in a relationship with some Bollywood actresses over Gaikwad s snub

'ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు జట్టులో చోటుదక్కనప్పుడు ఆటగాళ్లు బ్యాడ్ బాయ్ ఇమేజ్ కలిగి ఉండటం అవసరమనిపిస్తోంది. జట్టులో చోటు దక్కించుకోవాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకోవాలో ఏమో.. ఒళ్లంతా టాటూలు వేయించుకోవాలేమో. లేదా మంచి మీడియా మేనేజర్‌ను కలిగి ఉండాలేమో'అని బద్రీనాథ్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ప్రస్తుతం బద్రీనాథ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది.

జింబాబ్వే పర్యటనకు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో 77, 49 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయినా అతన్ని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయలేదు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లతో ఓపెనర్ల స్లాట్ ఫుల్‌గా ఉండటంతో రుతురాజ్ గైక్వాడ్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. జింబాబ్వే పర్యటనలో విధ్వంసకర శతకంతో చెలరేగిన అభిషేక్ శర్మను కూడా పక్కనపెట్టారు. కానీ ఈ పర్యటనలో పెద్దగా ఆకట్టుకొని రియాన్ పరాగ్‌కు అవకాశం కల్పించారు.

టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన బాధ్యతలను స్వీకరించనున్నాడు. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం టీమిండియా.. శ్రీలంకకు వెళ్లనున్న విషయం తెలిసిందే. శనివారం(జూలై 27) జరిగే తొలి టీ20తో ఈ టూర్ మొదలవ్వనుంది. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ పర్యటనలోని వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం రోహిత్.. అమెరికాలో కుటుంబ సభ్యులతో సేద తీరుతుండగా.. విరాట్ కోహ్లీ లండన్‌లో తన కుటుంబ సభ్యులతో విశ్రాంతి సమయాన్ని గడుపుతున్నాడు.

టీమిండియా టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

టీమిండియా వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

Story first published: Sunday, July 21, 2024, 12:50 [IST]
Other articles published on Jul 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+