బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన గంభీర్ అసిస్టెంట్!
టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవి నుంచి తప్పుకున్నాడు. టీమిండియా యూకే పర్యటనతోనే అతని పదవి కాలం ముగిసింది. ఈ పర్యటనలో భారత్ వరుసగా మూడు సిరీస్‌లను కోల్పోయింది. ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన భారత్.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో కోల్పోయింది.
ఈ పరాజయాల నేపథ్యంలోనే ర్యాన్ టెన్ డస్కాటేపై వేటు పడిందని ప్రచారం జరిగింది. కానీ డస్కాటేనే స్వయంగా తప్పుకున్నాడని తెలుస్తోంది. అతని పదవి కాలాన్ని 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నా.. అతను ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అతను తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు ఫీల్డింగ్ కోచ్‌గా కేకేఆర్ జట్టులో డస్కాటే చేరాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో గౌతమ్ గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టినా కూడా డస్కాటే ఆ టీమ్‌లో కొనసాగాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ టైటిల్ గెలవడంతో గంభీర్‌కు టీమిండియా హెడ్ కోచ్ పదవి వరించింది. అతను డస్కాటేతో పాటు అభిషేక్ నాయర్‌ను టీమిండియాలోకి తీసుకొచ్చాడు.
ఈ ఇద్దరితో పాటు బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ కూడా రెండేళ్ల కాలపరిమితో టీమిండియా సపోర్ట్ స్టాఫ్ బాధ్యతలు చేపట్టారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం అభిషేక్ నాయర్‌ను బీసీసీఐ తొలగించింది. గంభీర్ పదవికాలం మాత్రం 2027 వరల్డ్ కప్ వరకు ఉండగా.. ర్యాన్ టెన్ డస్కాటే పదవి కాలాన్ని కూడా అప్పటి వరకు పొడగించేందుకు బీసీసీఐ సిద్దమైంది. కానీ అతను ఈ బాధ్యతల్లో కొనసాగలేనని బీసీసీఐకి తెలియజేశాడు.
డస్కాటే హయాంలో భారత్ ఎన్నో ఒడిదొడుకులతో పాటు చిరస్మరణీయమైన విజయాలను అందుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర పరాజయం అనంతరం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ పర్యటనలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత యువ జట్టు ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. ఆ తర్వాత భారత్ ఆసియాకప్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2026 గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

