For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ కవ్వింపులకు బ్యాట్‌తోనే బదులిచ్చారు:టీమిండియా కోచ్

టీమిండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మలపై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే ప్రశంసల జల్లు కురిపించాడు. పాకిస్థాన్ ఆటగాళ్లు పదే పదే కవ్వింపులకు గురిచేసినా ఏకాగ్రత కోల్పోకుండా బ్యాట్‌తోనే బదులిచ్చారని కొనియాడాడు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో కవ్వింపులకు స్పందించకుండా ఆడటం చాలా కష్టమని, కానీ తమ ఆటగాళ్లు జట్టు ప్రణాళికలకు కట్టుబడి ఆడారని తెలిపాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరగనున్న సూపర్-4 మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ర్యాన్ టెన్ డస్కాటే.. పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్, ఓపెనర్ ఫర్హాన్ తీరును తప్పుబట్టాడు.

పాక్ ఆటగాళ్లు అలా ఎందుకు ప్రవర్తించారో..

'పాకిస్థాన్‌కు మంచి ఆరంభం లభించింది. కానీ దానికే వారు(ఫర్హాన్ తుపాకీ ఎక్కిపెట్టే సెలెబ్రేషన్స్) అలా సంబరాలు చేసుకున్నారని నేను అనుకోవడం లేదు. పరిస్థితిని బట్టి పాక్ ఆటగాళ్లు అలా ఎందుకు ప్రవర్తించారో..? ఏమి చూపించాలనుకున్నారో అనే విషయాన్ని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది మీకు కూడా తెలుసు. కానీ మేం మాత్రం క్రికెట్‌కు మాత్రమే కట్టుబడి ఆడాం. పాకిస్థాన్ బౌలింగ్ యూనిట్ నుంచి వచ్చిన కవ్వింపులు, వారు మాట్లాడిన మాటలు, చేసుకున్న సంబరాలు చూస్తే.. ఏ ఆటగాడైనా నియంత్రణలో ఉండటం కష్టం. కానీ మా ఆటగాళ్లు బ్యాట్‌తోనే బదులిచ్చారు.

Ryan ten Doeschate Praises Team India s Composure Against Pakistan s Provocative Gestures

గెలుపుతోనే వారి అత్యుత్సాహాన్ని తిప్పికొట్టారు. హరీస్ రౌఫ్ అలా ఎందుకు ప్రవర్తించాడో మాకు అనవసరం. కానీ మా ఆటగాళ్లు సహనం కోల్పోకుండా ఉండటం పట్ల మేం గర్వపడుతున్నాం. మా ఆటగాళ్లు బ్యాట్‌తోనే వారి అక్కసును ఎదుర్కొన్నారు. మా వల్ల వారికి కొన్ని సమస్యలు ఉన్నాయని తెలుసు. అయితే మా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు పట్ల మేం సంతోషంగా ఉన్నాం.'అని ర్యాన్ టెన్ డస్కాటే చెప్పుకొచ్చాడు.

బుమ్రాకు నో రెస్ట్..

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఆడుతాడని, అతనికి రెస్ట్ ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. ఆసియా కప్ 2025 టోర్నీ వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు అతనికి ప్రాక్టీస్‌లాంటిదని చెప్పాడు. సంజూ శాంసన్ ఐదో స్థానంలోనే ఆడుతాడని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా పాకిస్థాన్ ఓపెనర్ ఫర్హాన్, బౌలర్ హరీస్ రౌఫ్ వివాదాస్పద సంజ్ఞలు చేశారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఫర్హాన్.. బ్యాట్‌తో తుపాకీ ఎక్కుపెడుతున్నట్లుగా సంబరాలు చేసుకోగా.. హరీస్ రౌఫ్ రఫెల్ జెట్ విమానాలను కూల్చామని సైగలు చేశాడు. పాక్ ఆటగాళ్ల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పాక్ ఆటగాళ్ల కవ్వింపులకు అభిషేక్ శర్మ తన బ్యాట్‌తోనే బదులిచ్చాడు.

Story first published: Tuesday, September 23, 2025, 22:46 [IST]
Other articles published on Sep 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+