టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌ను అధిగమించాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్.. 52 బంతుల్లో 66 పరుగులు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌తో రుతురాజ్ గైక్వాడ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో 57.69 సగటును నమోదు చేశాడు. 2016-17 విజయ్ హజారే ట్రోఫీలో మహరాష్ట్ర తరఫున లిస్ట్-ఏ క్రికెట్‌ను ప్రారంభించిన రుతురాజ్ గైక్వాడ్.. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగాడు. 2022 అక్టోబర్‌లో సౌతాఫ్రికాతో తొలి అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఇటీవలే భారత వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో శతకంతో చెలరేగాడు. శుభ్‌మన్ గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.

లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ మైఖేల్ బెవెన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 57.86 సగటుతో 15103 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ బ్యాటర్ సామ్ హైన్ 57.76 సగటుతో 3004 పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 57.67 సగటుతో 16207 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉండగా.. రుతురాజ్ గైక్వాడ్ 57.69 సగటుతో 4904 పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. జనవరి 6న జరిగే విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ.. రుతురాజ్ గైక్వాడ్‌ను అధిగమించే ఛాన్స్ ఉంది.
రుతురాజ్ గైక్వాడ్ సూపర్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో మహరాష్ట్ర 128 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 366 పరుగులు చేసింది. అర్షిన్ కులకర్ణి(114) సెంచరీతో చెలరేగగా.. పృథ్వీ షా(71), రుతరాజ్ గైక్వాడ్(66), రామకృష్ణ ఘోష్(64 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ముంబై 542 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌటైంది. అంగ్‌క్రిష్ రఘువంశీ(92) సెంచరీ చేజార్చుకోగా.. సిద్దేష్ లాడ్(52) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.