IND vs SL: మలుపు తిప్పిన కంబోజ్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం!
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏ శుభారంభం చేసింది. శ్రీలంక-ఏ జట్టుతో మంగళవారం దంబుల్లా వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ జట్టు 8 పరుగుల తేడాతో గెలుపొందింది.రుతురాజ్ గైక్వాడ్(114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 101) శతకంతో భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలక వికెట్ తీసి అన్షూల్ కంబోజ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
రుతురాజ్ గైక్వాడ్ శతకం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 277 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ తిలక్ వర్మ(97 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ప్రియాన్ష్ ఆర్య(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32), సూర్యాన్ష్ షెడ్గే(14 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 26 నాటౌట్) పర్వాలేదనిపించారు. విధ్వంసకర ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్(2), వైభవ్ సూర్యవంశీ(14)తో పాటు ఆయుష్ బదోని(24) తీవ్రంగా నిరాశపర్చారు.

శ్రీలంక-ఏ బౌలర్లలో మహమ్మద్ షిరాజ్(2/67) రెండు వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే, గరుక సాంకేత్, వనుజా సాహన్ తలో వికెట్ తీసారు. అనంతరం శ్రీలంక-ఏ 48.5 ఓవర్లలో 269 పరుగులకు కూప్పకూలి ఓటమిపాలైంది.
కెప్టెన్ సహన్ అరాచ్చిగే(72 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74) హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్లుగా నిలవగా.. ఓపెనర్లు నిరోషన్ డిక్‌వెల్లా(45 బంతుల్లో 6 ఫోర్లతో 47), అవిష్కా ఫెర్నాండో(59 బంతుల్లో 7 ఫోర్లతో 45), సదీర సమరవిక్రమా(51 బంతుల్లో 4 ఫోర్లతో 46) పర్వాలేదనిపించారు. భారత్-ఏ బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకూల్ రాయ్, ఆయుష్ బదోని, విప్రజ్ నిగమ్, రెండేసి వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
మలుపు తిప్పిన అన్షూల్ కంబోజ్..
ఓ దశలో శ్రీలంక-ఏ ఈ మ్యాచ్ గెలిపించేలా కనిపించింది. ఆ జట్టు విజయానికి చివరి 12 బంతుల్లో 10 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో మూడు వికెట్లు ఉండటంతో శ్రీలంక-ఏ విజయం లాంఛనమేనని అనుకున్నారు. కానీ భారత బౌలర్లు 4 బంతుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు తీసి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు.
శ్రీలంక-ఏ ఓపెనర్లు తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. ఆ తర్వాత వరుస ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయినా.. నాలుగో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఐదో వికెట్ త్వరగానే పడినా..ఆరో వికెట్‌కు 42 పరుగులు.. ఏడో వికెట్‌కు 25 రన్స్ భాగస్వామ్యం నమోదైంది. 262/7 స్కోర్‌తో గెలుపు దిశగా సాగిన శ్రీలంక-ఏను భారత్-ఏ బౌలర్లు దెబ్బతీసారు.
ఏడు పరుగుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించారు. కెప్టెన్ సహన్ అరాచ్చిగేను ఏడో వికెట్‌గా పెవిలియన్ చేర్చి అన్షూల్ కంబోజ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసాడు. చివర్లో రుతురాజ్ గైక్వాడ్ చేసిన రనౌట్ కూడా భారత విజయానికి బాటలు వేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

