Ruturaj Gaikwad: మరో సెంచరీ.. శిఖర్ ధావన్ ప్లేస్ గల్లంతు!

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2021 సీజన్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలతో చెలరేగుతున్నాడు. తనదైన బ్యాటింగ్‌తో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. ఈ దేశవాళీ లీగ్‌లో మహారాష్ట్రను నడిపిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు బాదిన రుతురాజ్ తాజాగా చండీఘర్‌తో ముగిసిన లీగ్ మ్యాచ్‌లో మరో సెంచరీతో చెలరేగాడు. 95 బంతుల్లో 100 పరుగులు చేసిన రుతురాజ్‌కు.. తాను ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.

ఐదో బ్యాట్స్‌మన్‌గా..
ఈ సెంచరీతో విజయ్ హజారే ట్రోఫీలో 500 పరుగులు పూర్తి చేసిన రుతురాజ్ ఒక రికార్డును అందుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు బాదిన ఐదో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీ బాదిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, పృథ్వీ షాలు మాత్రమే ఉన్నారు. తాజాగా వీరి జాబితాలో రుతురాజ్ గైక్వాడ్ చేరాడు. విజయ్ హజారే ట్రోఫీ ద్వారా తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్న రుతురాజ్ ప్రస్తుతం భారత సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారాడు. రుతురాజ్‌ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

శిఖర్ ధావన్‌కు చెక్..
మాజీ క్రికెటర్లు సైతం రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపికచేయాలని, అతనేం 18 ఏళ్ల కుర్రాడు కాదని, 24 ఏళ్ల సత్తా కలిగిన క్రికెటరని సూచిస్తున్నారు. ఇక సౌతాఫ్రికా పర్యటనలోని మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసే జట్టులో రుతురాజ్ గైక్వాడ్ చోటు దక్కడం ఖాయమనిపిస్తోంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ వయసు దృష్ట్యా అతన్ని పక్కనపెట్టే అవకాశం ఉంది. ధావన్ ప్లేస్‌లో రుతురాజ్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటం కూడా రుతురాజ్‌కు కలిసిరానుంది. తుది జట్టులో త్వరగానే చోటు దక్కనుంది.

603 రన్స్‌తో..
మ్యాచ్ విషయానికి వస్తే.. లీగ్‌లో మహారాష్ట్ర మరో విజయాన్ని దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చంఢీఘర్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. కెప్టెన్ మనన్ వోహ్రా (139 బంతుల్లో 141, 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత సెంచరీతో మెరవగా.. అర్‌స్లాన్ ఖాన్ 87, అంకిత్ కౌషిక్ 56 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 48.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రుతురాజ్ గైక్వాడ్(132 బంతుల్లో 168 పరుగులు, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) మరో అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో అజిమ్ కాజీ 73 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం రుతురాజ్ 5 మ్యాచ్‌ల్లో 603 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications