Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs CSK: అందుకే ఓడాం: రుతురాజ్ గైక్వాడ్

బ్యాటింగ్ పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు చేయకపోవడమే తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. పిచ్‌లో మార్పు కనిపించిందని తెలిపాడు.

తొలి బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న పిచ్.. రెండో ఇన్నింగ్స్‌లో సీమ్ అయిందన్నాడు. 'పవర్ ప్లే తర్వాత మా బౌలర్లు పుంజుకున్న తీరు అద్భుతం. 190 పరుగులకు కట్టడి చేయడం బౌలర్ల నుంచి గొప్ప ప్రదర్శన. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సీమ్ మూవ్‌మెంట్ కనిపించింది.

rutu

ఈ ఎక్స్‌ట్రా బౌన్స్, మూవ్‌మెంట్ వల్లే రచిన్ రవీంద్ర ఔటయ్యాడు. గెలుపునకు ఓటమికి ఉన్న తేడా ఇదే. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ఈ లక్ష్యాన్ని మేం ఛేదిస్తామని అనుకున్నా. కానీ పవర్ ప్లేలో మేం దారుణంగా విఫలమయ్యాం. దాంతో లక్ష్యచేధనలో వెనకబడ్డాం. వేగంగా పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించేందుకు తీవ్రంగా ప్రయత్నించాం.

బౌలింగ్‌లో కొన్ని ఓవర్లు అద్భుతంగా వేసాం. కానీ పవర్ ప్లేలో చివరి రెండు ఓవర్లలో చాలా దారళంగా పరుగులు వచ్చాయి. రెండు విజయాల తర్వాత ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ఎలాంటి ఆందోళన లేదు'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52), రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. పృథ్వీ షా(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) మెరుపులు మెరిపించాడు.

చెన్నై బౌలర్లలో మతీష పతీరణ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేసి ఓటమిపాలైంది. అజింక్యా రహానే(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), మహేంద్ర సింగ్ ధోనీ(16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్), డారిల్ మిచెల్(26 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Monday, April 1, 2024, 0:00 [IST]
Other articles published on Apr 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+