అందుకే ధోనీ ఆడటం లేదు: రుతురాజ్ గైక్వాడ్
ఫిట్‌గా లేకపోవడంతోనే మహేంద్ర సింగ్ ధోనీ ఆడటం లేదని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ప్రస్తుతం ధోనీ జట్టుతోనే ఉన్నాడని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
చెపాక్ మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇదే చివరి మ్యాచ్ కావడంతో మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగుతాడని, ఇది అతని వీడ్కోలు మ్యాచ్ అంటూ సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగలేదు.
ప్లే ఆఫ్స్ చేరడం సులువే..
టాస్ సందర్భంగా ధోనీ గురించి ప్రశ్నించగా.. అతనికి మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్ లేదని రుతురాజ్ గైక్వాడ్ స్పష్టం చేశాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని చెప్పాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ప్లే ఆఫ్స్ అవకాశాలు మాకు అంత సంక్లిష్టంగా ఏం లేవు. ఒక్కో మ్యాచ్ గెలవడంపై మేం ఫోకస్ పెట్టాం. ఈ మ్యాచ్ గెలవాలనుకుంటున్నాం. మెరుగైన ఆరంభాన్ని అందుకొని పిచ్ కండిషన్స్‌ను సరిగ్గా అంచనా వేస్తూ మా అత్యుత్తమ ప్రదర్శ ఇవ్వాలనుకుంటున్నాం.

ఈ మ్యాచ్ నేపథ్యంలో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఇక్కడి కండిషన్స్‌కు గౌరవం ఇస్తూ ఆడితే ఆశించిన ఫలితం దక్కుతుంది. ఇక్క ముందుగా బ్యాటింగ్ చేయడం మంచిదనిపిస్తోంది. ధోనీ జట్టుతోనే ఉన్నాడు. కానీ మ్యాచ్ ఆడేంత ఫిట్‌గా లేడు. ఈ మ్యాచ్ గెలుస్తామని భావిస్తున్నాం. ఆ తర్వాత ఆఖరి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. మా జట్టులో ఒక మార్పు చేశాం. గుర్జప్‌నీత్ స్థానంలో అకీల్ హోసేన్ జట్టులోకి వచ్చాడు.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
ప్లే ఆఫ్స్ చేరడమే మా టార్గెట్..
మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ చేరడమే తమ లక్ష్యమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా దూకుడు కొనసాగిస్తామని చెప్పాడు. 'ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం మా ముందున్న ప్రధాన లక్ష్యం. గత మ్యాచ్ తర్వాత మాకు మంచి విరామం లభించింది. ఈ మ్యాచ్‌కు అన్ని విధాల సిద్దంగా ఉన్నాం. ఇది టీ20 క్రికెట్.. ఇక్కడ మీరు ఒక నిర్దిష్ట ఆట శైలిని అలవర్చుకోవాలి. అది ప్రతి రాత్రి వర్కౌట్ కాకపోయినా సరే.
మా ఆటగాళ్లు ఆ శైలిని చాలా బాగా అవలంబించారని నేను భావిస్తున్నాజ జట్టు వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. మేం ఆడే విధానం బహుశా ప్రతి మ్యాచ్‌లోనూ వర్కవుట్ కాకపోవచ్చని మాకు తెలుసు, కానీ అది ఉత్సాహభరితంగా ఉంటుంది. కాబట్టి, ఇదే మా అత్యుత్తమ ఆట శైలి అని మేం భావిస్తున్నాము, అందుకే మేం ఆ దూకుడును మరింతగా కొనసాగిస్తాం. మేం బహుశా మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాం, కానీ ఎవరికి తెలుసు ఏది మంచిదో. కాబట్టి టాస్ ఓడిపోయినందుకు ఎలాంటి బాధ లేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications