సీరియల్ నటితో రుతురాజ్ గైక్వాడ్ ప్రేమాయణం.. ఏమోజీలతో వ్యవహారం..!

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ సీరియల్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరాఠా సీరియల్ నటి సయాలి సంజీవ్‌తో ఈ చెన్నై ప్లేయర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడంట. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసే ఈ ఇద్దరి రచ్చ చూస్తే వారి మధ్య ఉన్న లవ్ ఎఫైర్ అర్థమవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
తాజాగా సయాలి సంజీవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలపై రుతురాజ్ గైక్వాడ్ కామెంట్ చేశాడు. వావ్.. లవ్లీ అంటూ కళ్లల్లో ప్రేమ నిండిన ఎమోజీలను పోస్ట్ చేశాడు. హీరోయిన్ కూడా లవ్ సింబల్స్‌తో సిగ్గుపడుతున్నట్లుగా ఉన్న ఏమోజీలతో రిప్లే ఇచ్చింది. దాంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సయాలి సంజీవ్ అందానికి రుతురాజ్ గైక్వాడ్ పడిపోయాడంటూ నెట్టింట మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

బౌలర్లకు తప్ప ఎవరీకీ బౌల్డ్ అవ్వను..
ఇక ఈ పుకార్లపై రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. బౌలర్లు మినహా మరేవరూ తనను క్లీన్ బౌల్డ్ చేయలేరని పరోక్షంగా మరాఠీలో కామెంట్ చేశాడు. 'కేవలం బౌలర్లు మాత్రమే నా వికెట్ తీయగలరు. అది కూడా క్లీన్ బౌల్డ్ చేయలగలరు. మరెవరికీ ఇది సాధ్యం కాదు. అర్థం అయిన వారికి, అర్థం కావాల్సిన వారికే ఈ విషయం'అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. దాంతో ఈ లవ్ రూమర్స్‌కు బ్రేక్ పడినట్లు అయింది. అయితే గైక్వాడ్ మీదికి అలా చెబుతున్నా.. సయాలి ప్రేమలో మాత్రం మునిగితేలుతున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఎవరీ సయాలి సంజీవ్..?
సయాలి పాపులర్ మరాఠీ టీవి నటి. ఇప్పటికే ఆమె చాలా సీరియళ్లలో నటించింది. జీ మరాఠిలో వచ్చే ఫేమస్ సీరియల్ 'కహే దియా పర్దేస్'తో ప్రజల అభిమానాన్ని అందుకుంది. గౌరీ సీరియల్‌లో లీడ్ రోల్ చేసింది. మహారాష్ట్రలోని ధులె జిల్లాలో పుట్టిన ఆమె.. అక్కడే స్కూలింగ్ పూర్తి చేసింది. నాసిక్‌లో ఆర్ట్స్ డిగ్రీ పట్టా అందుకుంది. 2016లో జీ మరాఠి తరఫున ఉత్తమ నటి అవార్డు కూడా సాధించింది. మోడల్ అయిన ఆమె కొన్ని బ్రాండ్లకు ప్రచరాకర్తగా కూడా వ్యవహరిస్తోంది.

గత సీజన్‌తో..
ఇక మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆరంభంలో కరోనా బారిన పడి జట్టుకు దూరమైన అతను వచ్చిన అవకాశాలను కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. కానీ సీజన్ ఎండింగ్‌తో దుమ్ములేపాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది తన సత్తా ఏంటో తెలియజేశాడు. తాజా సీజన్‌లోనూ గైక్వాడ్ అదే జోరును కొనసాగించాడు. డూప్లెసిస్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలు అందించాడు. ఈ సీజన్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన అతను.. 128.94 స్ట్రైక్‌రేట్‌తో 196 రన్స్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగులు చేశాడు. గత రెండేళ్లుగా భారత్-ఏ తరఫున కూడా గైక్వాడ్ నిలకడగా రాణిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications