Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్

నితీష్ రాణా అద్భుత బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్ తప్పిదాలు, ఓపెనర్ల వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో సీఎస్‌కేకు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. రాజస్థాన్ రాయల్స్‌కు తొలి విజయం. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. మైదానంలో తాము చురుగ్గా వ్యవహరించలేదని ఒప్పుకున్నాడు. ఓపెనర్లు మెరుగైన ఆరంభం అందిస్తేనే విజయాలు దక్కుతాయని అభిప్రాయపడ్డాడు.

పవర్ ప్లే దెబ్బతీసింది..
'పవర్ ప్లే మా కొంపముంచింది. నితీష్ రాణా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతన్ని పట్ల మేం చురుగ్గా వ్యవహరించలేదు. బిహైండ్ స్క్వేర్ దిశగా ఆడుతున్న నితీష్‌ను.. మేం ఫ్రంట్ ఆఫ్ ది వికెట్‌‌ ఆడించాల్సింది. ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా 8-10 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. ఫీల్డింగ్‌ విషయంలో మెరుగయ్యేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. 180 పరుగుల లక్ష్యం చేధించదగినదే. ఇది బ్యాటింగ్‌కు మంచి వికెట్. 210 పరుగుల దిశగా సాగిన రాజస్థాన్ రాయల్స్‌ను 180 పరుగులకు కట్టడి చేయడం సంతోషాన్నిచ్చింది.

Ruturaj Gaikwad says CSK not pro-active enough after losing to the RR in IPL 2025 clash
Photo Credit: screen grab for JioHotstar

అందుకే మిడిలార్డర్‌లో..
గతంలో అజింక్యా రహానే, అంబటి రాయుడు సీఎస్‌కే మిడిల్ ఓవర్ల‌లో బాధ్యత తీసుకొని ఆడేవారు. వారు లేకపోవడంతో నేను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ రావడమే ఉత్తమమని మేం భావించాం. త్రిపాఠి టాపార్డర్‌లో దూకుడుగా ఆడుతాడనుకున్నాం. అయినా ఇది పెద్ద సమస్యే కాదు. ఎందుకంటే గత మూడు మ్యాచ్‌ల్లో నేను ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చాను(నవ్వుతూ). నేను మూడో స్థానంలో ఆడాలని వేలంలో సమయంలో నిర్ణయించారు. ఫస్ట్ డౌన్‌లో ఆడేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటు రిస్క్ తీసుకొగలను.

శుభారంభం దక్కితే..
దురదృష్టవశాత్తు మాకు సరైన ఆరంభాలు దక్కడం లేదు. శుభారంభం దక్కితే పరిస్థితి మరోలా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా మాకు సానుకూల అంశాలు ఉన్నాయి. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే బౌలింగ్‌ విభాగంలో మూమెంటమ్ అవసరం. ఆ మూమెంటమ్ వస్తే సీఎస్‌కేకు తిరుగుండదు.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 63) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 34 నాటౌట్), ధోనీ(16) గెలుపు కోసం పోరాడారు. వానిందు హసరంగా (4/35) నాలుగు వికెట్లతో సీఎస్‌కే పతనాన్ని శాసించాడు.

Story first published: Monday, March 31, 2025, 0:19 [IST]
Other articles published on Mar 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+