7 బంతుల్లో 7 సిక్స్‌లు.. యువీ ఆల్‌టైమ్ రికార్డు బద్దలుకొట్టిన రుతురాజ్! (వీడియో)

అహ్మదాబాద్: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒకే ఓవర్‌లో నోబాల్‌తో సహా వరుసగా 7 సిక్స్‌లు బాది ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఏ స్థాయి క్రికెట్‌లోనైనా 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదడమే రికార్డు.
తాజాగా రుతురాజ్ ఈ ఘనతను అధిగమించి నయా రికార్డు సృష్టించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ ఈ ఘనతను అందుకున్నాడు. మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రుతురాజ్.. ఉత్తర్ ప్రదేశ్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.
ఒకే ఓవర్‌లో 43 పరుగులు..
యూపీ బౌలర్ శివా సింగ్ వేసిన 49వ ఓవర్‌లో రుతురాజ్ ఈ ఘనతను అందుకున్నాడు. వరుసగా నాలుగు బంతులను రుతురాజ్ సిక్సర్లుగా కొట్టగా.. ఒత్తిడికి గురైన బౌలర్ ఐదో బంతిని నోబాల్‌గా వేసాడు. ఆ బంతిని కూడా సిక్స్ బాదిన రుతురాజ్ తర్వాతి రెండు బంతులను కూడా సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. దాంతో ఈ ఓవర్‌లో 43 పరుగులు వచ్చాయి. రుతురాజ్ వరల్డ్ రికార్డు నమోదు చేస్తే.. ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డును శివా సింగ్ మూటగట్టుకున్నాడు. దాదాపు తన కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేసుకున్నాడు.
16 సిక్స్‌లతో విధ్వంసం..
ఈ విధ్వంసంతో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న రుతురాజ్ గైక్వాడ్(159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 220 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో రుతురాజ్ ఏకంగా 16 సిక్స్‌లు బాదడం విశేషం. అతని విధ్వంసంతో మహరాష్ట్ర 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉత్తరప్రదేశ్ ముందు ఉంచింది. రుతురాజ్ ఒక్కడే డబుల్ సెంచరీ సాధించగా.. అంకిత్ బావ్నే(37), అజిమ్ కాజీ(37) పరుగులతో రాణించారు. దాంతో మహరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 330 పరుగులు చేసింది.
మూడో భారత ఆటగాడిగా..
ఇక ఏ స్థాయి క్రికెట్‌లోనైనా ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ తరఫున 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన మూడో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్‌లో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఈ ఫీట్ సాధించగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ ఈ ఘనతను అందుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్డ్ బ్రాడ్ బౌలింగ్‌ను ఉతికారేసాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా ప్లేయర్ గిబ్స్, వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్.. కూడా 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications