For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ గురించి రుతురాజ్ ఏమన్నాడంటే?

దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లే తాము ఎక్కడికి వెళ్లినా స్టేడియాలు పసుపు మయం అవుతున్నాయని చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. దురదృష్టవశాత్తు ఆయన ఆడటం లేదని, కానీ ఈ క్రేజ్ సృష్టికర్త ధోనీనే అని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్‌ను ముంబైలో సీఎస్‌కే క్రేజ్‌ గురించి హోస్ట్ ప్రశ్నించాడు. ధోనీ వల్లే ఈ క్రేజ్ అని గైక్వాడ్ బదులిచ్చాడు. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని గైక్వాడ్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ ఇది 50-50 నిర్ణయమే. పిచ్ బాగుంది. వాంఖడేలో ముందుగా బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా మెరుగైన ప్రదర్శన కనబర్చడం ముఖ్యం. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసినా సరే అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం కీలకం.

Ruturaj Gaikwad Credits The Legend MS Dhoni for CSK s Massive Global Support During MI Clash in IPL 2026
Photo Credit: screen grab for JioHotstar

ధోనీ వల్లే ఈ క్రేజ్..

మేం మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాం. కానీ కీలక సమయాల్లో అవకాశాలను చేజార్చుకుంటున్నాం.గత మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్‌లో కూడా మంచి ఆరంభం లభించింది. కానీ కీలక సమయంలో తడబడి విజయాన్ని చేజార్చుకున్నాం. జట్టులో అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

మా దిగ్గజం ధోనీ వల్లే మేం ఎక్కడికి వెళ్లినా అభిమానుల మద్దతు లభిస్తోంది. స్టేడియాలు పసుపుమయం అవుతున్నాయి. దురదృష్టవశాత్తూ ధోనీ ఈ మ్యాచ్ ఆడటం లేదు. కానీ ఇదంతా ఆయన సృష్టించిన ప్రభావమే. ఈ రాత్రి మా అభిమానులను సంతోషపరుస్తామని ఆశిస్తున్నాను. మా జట్టులో రెండు మార్పులు ఉన్నాయి.'అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. గత మ్యాచ్ తరహాలోనే మెరుగైన ప్రదర్శన చేసి విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆటను ఆస్వాదించాలని మా కుర్రాళ్లకు చెప్పానన్నాడు. కోల్‌కతాతో మ్యాచ్ తరహాలోనే ఈ పిచ్ ఉందని, ఆ మ్యాచ్ తరహాలోనే లక్ష్యాన్ని ఛేదిస్తామని చెప్పాడు.

ఐపీఎల్ అంటే వారికి టైంపాస్ టూర్.. ఫ్రాంచైజీలను దోచుకున్న దొంగలు!ఐపీఎల్ అంటే వారికి టైంపాస్ టూర్.. ఫ్రాంచైజీలను దోచుకున్న దొంగలు!

తుది జట్లు

ముంబై ఇండియన్స్: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), తిలక్ వర్మ, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, క్రిష్ భగత్, ఎఎమ్ గజన్ ఫర్, అశ్విని కుమార్.

చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరి.

IPL 2026: సీఎస్‌కేలో‌కి ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్నర్!IPL 2026: సీఎస్‌కేలో‌కి ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్నర్!

Story first published: Thursday, April 23, 2026, 20:09 [IST]
Other articles published on Apr 23, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+