CSK vs DC: సంజూ కాదు.. వారి వల్లే ఈ విజయం: రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత విజయం సాధించింది. అయితే ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా బౌలర్లేదనని సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ.. తమ విజయంలో బౌలర్లదే కీలక పాత్ర అని రుతురాజ్ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు.
శనివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. సంజూ శాంసన్(56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్) అజేయ సెంచరీతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చగా..జెమీ ఓవర్టన్ నాలుగు వికెట్లు తీసాడు.
బౌలర్లదే కీలక పాత్ర..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్.. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. 'ఈ విజయాన్ని అందుకోవడం, గెలిచిన కెప్టెన్‌గా మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక అద్భుతమైన ప్రదర్శన. మేం ఇక్కడ ఆడిన గత మ్యాచ్‌లో కూడా మెరుగైన ప్రదర్శనే చేశాం. వికెట్ కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ.. ముందుగా బ్యాటింగ్ చేసి 200-210 పరుగులు చేసామంటే మా బ్యాటింగ్ బాగుందనే అర్థం. ఈరోజు కూడా సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. ఆయుష్ కూడా అద్భుతంగా రాణించాడు.

అయితే ఈ రోజు గెలుపులో బౌలింగ్ పాత్రే కీలకం. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం, అగ్రెసివ్ లెంగ్త్‌ల్లో బంతులు వేయడం, ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం మా విజయానికి కలిసొచ్చింది. మా బౌలర్ల కృషిని చూసి గర్వపడుతున్నా. నిజానికి మా బౌలింగ్ లైనప్‌లో 'ఎక్స్-ఫ్యాక్టర్' బౌలర్ లేకపోయి ఉండవచ్చు. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ ఎంత ప్రభావవంతంగా ఉండాలి, ముందస్తుగా ఎలా ఆలోచించాలి, అదనపు బౌండరీలను ఎలా ఆపాలి అనే విషయాలపై మేం చర్చించుకుంటూనే ఉన్నాం.
మా ఫ్యాన్స్ ప్రాణమిస్తారు..
డిఫెన్సివ్ ఫీల్డింగ్ ఉన్నప్పటికీ, ఎటాకింగ్ మోడ్‌లో ఉంటూ సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం మేం చేయాల్సిన పని. గత కొన్ని మ్యాచ్‌ల్లో కూడా మేం దాదాపు గెలిచే స్థితిలోనే ఉన్నాం. కాకపోతే ఒకటి లేదా రెండు ఓవర్లలో 20-25 పరుగులు సమర్పించుకోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది.
పవర్‌ప్లేలో మేం కొంచెం వెనకంజలో నిలిచినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాం. చెన్నై ఫ్యాన్స్ ఎప్పుడూ మాకు అండగా ఉంటారు. మేం ఎక్కడికి వెళ్లినా వారి మద్దతు, సందేశాలు మమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దక్షిణ భారత్ ప్రత్యేకతే అది. ఇక్కడి ప్రజలు చాలా మంచి వారు. వారు క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీకి ప్రాణమిస్తారు'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
సీఎస్‌కేకు తొలి విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. సంజూ శాంసన్(56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. ఆయుష్ మాత్రే(36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీయగా.. ఆయుష్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో189 పరుగులకు ఆలౌటైంది. ట్రిస్టన్ స్టబ్స్(38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్(4/18) నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్(3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, గుర్జప్‌నీత్ సింగ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications