RSWS 2022 థ్రిల్లింగ్ సెమీఫైనల్.. ఓడిపోయే మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ను గెలిపించిన ఓజా, ఇర్ఫాన్ పఠాన్..!

రాయ్‌పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో ఇండియా లెజెండ్స్ ఫైనల్ చేరింది. గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో నమాన్ ఓజా(62 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇర్ఫాన్ పఠాన్(12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్నందించాడు.
ఆసీస్ 171/5
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డంక్(26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ షెన్ వాట్సన్(21 బంతుల్లో 6 ఫోర్లతో 30), అలెక్స్ డూలన్(31 బంతుల్లో 5 ఫోర్లోతో 35), కామెరూన్ వైట్(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 30 నాటౌట్)పర్వాలేదనిపించారు. భారత లెజెండ్స్ బౌలర్లలో మునాఫ్ పటేల్(2/25), యూసఫ్ పటాన్(2/36) రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇండియా 175/5
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఇండియా లెజెండ్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 175 పరుగులు చేసి మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. నమాన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్ మినహా ఎవరూ రాణించలేదు. ఆసీస్ లెజెండ్స్ బౌలర్లలో షేన్ వాట్సన్ 2 వికెట్లు తీయగా.. జాసన్ క్రేజా, నాథన్ రియర్డన్, మెక్‌గెయిన్ తలో వికెట్ తీసారు. ఓ దశలో 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత లెజెండ్స్.. విజయం సాధించడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
టర్నింగ్ పాయింట్..
చివరి 24 బంతుల్లో భారత్ లెజెండ్స్ విజయానికి 49 పరుగులు అవసరమవ్వగా.. ఇర్ఫాన్ పఠాన్ ఒక్కడే 36 పరుగులు చేశాడు. డిర్క్ నన్నేస్ వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్(10), సురేశ్ రైనా(11), యువరాజ్ సింగ్(18), యూసఫ్ పఠాన్(1) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా సురేశ్ రైనా అందుకున్న ఓ సెన్సేషనల్ క్యాచ్ ఈ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications