For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సుప్రీంను ఆశ్రయించిన స్టార్ క్రికెటర్ సతీమణి

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తనకు నెల నెలా చెల్లించే రూ. 4 లక్షల భరణం సరిపోవడం లేదని అతని మాజీ సతీమణి హసీన్ జహాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనకు, తన కుమార్తెకు కోల్‌కతా హైకోర్టు మంజూరు చేసిన మెయింటెనెన్స్ ఖర్చులను పెంచాలని హసిన్ జహాన్ పిటిషన్ ధాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని మహమ్మద్ షమీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

2014లో హసీన్ జహాన్‌ను షమీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2015లో వీరికి ఐరా అనే అమ్మాయి జన్మించింది. 2018 వరకు సాఫీగా సాగిన వీరి సంసారం ఆ తర్వాత కోర్టుకెక్కింది. షమీపై జుగుప్సాకరమైన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్.. అతని కుటుంబపై గృహ హింస కేసు పెట్టింది. విడాకులకు కూడా దరఖాస్తు చేసింది.

Rs 4 Lakh Per Month Not Enough Supreme Court Issues Notice to Shami on Hasin Jahan s Petition

ఈ ఇద్దరికి విడాకులు మంజూరు చేసిన జిల్లా సెషన్స్ కోర్టు భరణం కింద హసీన్ జహాన్‌కు నెలకు రూ. 50 వేలు, ఐరాకు రూ. 80 వేల చొప్పున ఇవ్వాలని ఆదేశించగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ మొత్తాన్ని కోర్టు రూ. 4 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఆ డబ్బులూ సరిపోవడం లేదని ఆమె సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

ఉంపుడు గత్తెలకు లక్షలు తగిలేసే షమీ.. తన కూతురికి మాత్రం డబ్బులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నాడని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియాలో చోటు కోల్పోయిన షమీ.. దేశవాళీ క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించినా.. అతనికి టీమిండియాలో అవకాశం దక్కడం లేదు.

Story first published: Friday, November 7, 2025, 20:37 [IST]
Other articles published on Nov 7, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+