Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాటర్ భాయ్‌గా డేవిడ్ వార్నర్.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!

RR vs SRH: David Warner Becomes Water Boy For SRH

హైదరాబాద్: ఒకసారి టైటిల్.. రెండు సార్లు ప్లే ఆఫ్స్.. 35 విజయాలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ ట్రాక్ రికార్డ్.! 50 హాఫ్ సెంచరీలు.. 4 శతకాలు..201 సిక్సర్లు.. 205 ఫోర్లు.. 140.13 స్ట్రైక్‌రేట్.. 5447 రన్స్.. బ్యాట్స్‌మెన్‌గా అతను సాధించిన ఘనతలు! అయితేనేం గడ్డు పరిస్థితులు ఎంతటి ఆటగాడినైనా నేలకు దించుతాయి. అవును ఈ క్యాష్ లీగ్‌లో ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ ఆసీస్ స్టార్.. సాదా సీదా ఆటగాడిగా వాటర్ బాటిళ్లు మోస్తుండటం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

తాజా సీజన్‌లో నిరాశజనక ప్రదర్శన కనబర్చిన డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్ రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తుది జట్టు నుంచి కూడా తప్పించింది. దాంతో వార్నర్ వాటర్ భాయ్‌గా అవతారమెత్తాడు. యువ ఆటగాళ్లతో కలిసి డ్రింక్స్ బాటిళ్లు మోస్తున్నాడు. ఇది చూసిన అతని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఎలాంటి ఆటగాడిని ఎలా చేశారని సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనను అంత అవమానించిన జట్టుకోసం వార్నర్ చేస్తున్న పనిని మాత్రం కొనియాడుతున్నారు. జట్టులో ఏదో విధంగా భాగం కావాలనే అతని తపనను మెచ్చుకుంటున్నారు. గొప్ప ఆటగాళ్లంతా ఇలానే ఉంటారని కామెంట్ చేస్తున్నారు.

2014 నుంచి సన్‌రైజర్స్‌ తరఫున ఆడిన ఆరు సీజన్లలో డేవిడ్‌ వార్నర్‌ 528, 562, 848, 641, 692, 548 చేసిన పరుగులివి. ప్రతీ సీజన్‌లో జట్టు తరఫున అతనే టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. బ్యాట్స్‌ మన్‌గా అతని రికార్డు ఘనం. రైజర్స్‌ అంటే వార్నర్‌ మాత్రమే అన్నట్లుగా అతని బ్యాటింగ్‌ జోరు కొనసాగింది. వార్నర్‌ విఫలమైతే మ్యాచ్‌ ఓడిపోయినట్లే అని సగటు జట్టు అభిమాని ఎవరైనా చెప్పగలరంటే అతని ప్రభావం ఏమిటో అర్థమవుతుంది. అలాంటి ఆటగాడిన పక్కనపెట్టడం సరైన నిర్ణయం కాదని టీమ్‌మేనేజ్‌మెంట్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జోస్ బట్లర్(64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124) విధ్వంసకర సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు రాజస్థాన్ రాయల్స్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అతనికి తోడుగా సంజూ శాంసన్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఆదిలోనే ఈ ఇద్దరు ఇచ్చిన సునాయస క్యాచ్‌లను విజయ్ శంకర్, మనీష్ పాండే‌లు నేలపాలు చేయడంతో హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది.

Story first published: Sunday, May 2, 2021, 18:08 [IST]
Other articles published on May 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+