Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs RCB: జెమీసన్ ఔట్.. ఆర్‌సీబీలోకి నయా ప్లేయర్! రాజస్థాన్‌దే బ్యాటింగ్

Virat Kohli wins toss elect

దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు కొత్త వికెట్ ఉపయోగిస్తున్నారని, పిచ్ పరిస్థితి అర్థం చేసుకోవడానికే ఫీల్డింగ్ ఎంచుకున్నానని విరాట్ చెప్పుకొచ్చాడు. 'గత మ్యాచ్‌లానే మంచి ఆరంభం అందిస్తే సులువుగా పరుగులు చేయవచ్చు. అదే మా ప్లానింగ్. బ్యాటింగ్ యూనిట్‌గా గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాం. ఈ మ్యాచ్‌లో కూడా అదే కొనసాగించాలనుకుంటున్నాం. కొత్త వికెట్‌పై ఆడుతున్నాం. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత బ్యాటింగ్ చేస్తే పిచ్ ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు. వ్యక్తిగతంగా రాణించడం సంతోషంగా ఉంది. నా శక్తి సామర్థ్యం మేరకు జట్టు కోసం పరుగులు చేస్తాను. ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో బరిలోకి దిగుతున్నాం. కైల్ జెమీసన్ స్థానంలో జియార్జ్ గార్టన్ అరంగేట్రం చేస్తున్నాడు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇక బ్యాటింగ్ అయినా.. బౌలింగ్ అయినా చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ప్రస్తుతం లీగ్‌లో తమ పరిస్థితి ఏంటో తెలుసని, ఈ మ్యాచ్‌లో మా తప్పిదాలను సరిదిద్దుకుంటామన్నాడు. అభిమానుల నుంచి చాలా మద్దతు లభిస్తుందని, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే తమ లక్ష్యమన్నాడు. ఇక జయదేవ్ ఉనాద్కట్ స్థానంలో కార్తీక్ త్యాగీ జట్టులోకి వచ్చాడన్నాడు.

ఈ మ్యాచ్ గెలవడం రెండు జట్లకూ కీలకమే. ఆర్‌సీబీ విజయం సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌ది తప్పక గెలవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆర్‌సీబీ 6 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ రాయల్స్ మాత్రం నాలుగు విజయాలతో ఏడో స్థానంలో ఉంది. ఈ సీజన్ తరువాత విరాట్ కోహ్లీ కేప్టెన్సీ హోదా నుంచి తప్పుకోనున్నాడు. అందుకే- ఈ సారి కప్ కొట్టాలనే కసిలో రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ఉంది. టైటిల్ గెలిచి తమ కేప్టెన్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని ప్రయత్నిస్తోంది. తన కోరిక నెరవేరాలంటే- రాజస్థాన్ రాయల్స్‌ను కూడా చిత్తు చేయక తప్పదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా ఖాయం అవుతాయి. ఐపీఎల్ టోర్నమెంట్ ఎమిరేట్స్‌కు షిఫ్ట్ అయిన తరువాత తొలి రెండు మ్యాచుల్లో ఆర్‌సీబీ ఓటమిపాలైంది. అయితే గత మ్యాచ్‌లో పటిష్ట ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్.. ఆర్‌సీబీ ఓడించి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని భావిస్తోంది.

తుది జట్లు:

రాజస్థాన్ రాయల్స్:
ఎవిన్ లూయిస్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, లియమ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్‌రోర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగీ, ముస్తాఫిజుర్ రెహ్మాన్

ఆర్‌సీబీ:
విరాట్ కోహ్లీ (కేప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, జియార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్‌

Story first published: Wednesday, September 29, 2021, 19:24 [IST]
Other articles published on Sep 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+