For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: ఆర్‌సీబీ చిత్తు రేగ్గొట్టిన బుడ్డోడు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఆ జట్టు విజయం సాధించింది. గౌహతి వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని చిత్తు చేసింది.

మరోవైపు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తనకే సాధ్యమైన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లను ఊచకోత కోసాడు. వరల్డ్ బెస్ట్ బౌలర్లు అయిన జోష్ హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌ను చితక్కొట్టాడు.

వైభవ్ ఊచకోత..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్(40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 7 ఫోర్లతో 32), వెంకటేశ్ అయ్యర్(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) దూకుడుగా ఆడారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/33), రవి బిష్ణోయ్(2/32), బ్రిజేశ్ శర్మ(2/37) రెండేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ(1/47), రవీంద్ర జడేజా(1/14) చెరో వికెట్ పడగొట్డారు.

RR vs RCB Turning Point Vaibhav Sooryavanshi Fearless Assault That Demolished RCB s Bowling Rhythm

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ(26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78), ధ్రువ్ జురెల్(43 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(2/44), కృనాల్ పాండ్యా(2/30) రెండేసి వికెట్లు తీసారు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఇదే తొలి పరాజయం కాగా.. రాజస్థాన్ రాయల్స్‌కు వరుసగా నాలుగో విజయం. దాంతో ఆ జట్టు పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఆర్‌సీబీ కొంపముంచిన బ్యాటింగ్ వైఫల్యం..

వరుసగా వికెట్లు కోల్పోవడం ఆర్‌సీబీని దెబ్బతీసింది. దూకుడుగానే తమ ఇన్నింగ్స్ ప్రారంభించినా పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. దాంతో ఇతర బ్యాటర్లు ఒత్తిడికి లోనై వికెట్లు పారేసుకున్నారు. చివరకు ఎక్స్‌ట్రా బ్యాటర్ కోసం ఇంపాక్ట్ ప్లేయర్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను ఆడించాల్సి వచ్చింది.

రజత్ పటీదార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో 201 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందుకున్నా.. సుయాశ్ శర్మ లేకపోవడంతో ఆర్‌సీబీ బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వెంకటేశ్ అయ్యర్ ఆడటంతో సుయాశ్ శర్మ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. దానికి తోడు వైభవ్ విరుచుకుపడటంతో ఆర్‌సీబీ చేతులెత్తేసింది. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ.. ఫాస్టెస్ట్ సెంచరీ దిశగా సాగాడు. కానీ అతన్ని కృనాల్ బోల్తా కొట్టించాడు. వైభవ్ ఔటైనా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Story first published: Saturday, April 11, 2026, 0:19 [IST]
Other articles published on Apr 11, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+