Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs RCB: పోవెల్ క్యాచ్.. పోలా అదిరిపోలా!(వీడియో)

రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్ రోవ్‌మన్ పోవెల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పోవెల్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు.అచ్చం నీటిలో చేప పిల్లలా ముందుకు డైవ్ చేసిన పోవెల్.. అద్భుతంగా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. పోవెల్ స్టన్నింగ్ క్యాచ్‌కు ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(17) నిరాశగా వెనుదిరిగాడు.

పోవెల్ సూపర్ డైవ్ క్యాచ్‌కు ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు మైదానంలో ఆటగాళ్లు, అంపైర్లు, అభిమానులు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. క్యాచ్ ఆఫ్ ది టోర్నీ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

RR vs RCB Rovman Powell takes stunning catch to dismiss Faf du Plessis in IPL 2024 Eliminator

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఐదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని షార్ట్ పిచ్‌గా వేయగా.. ఫాఫ్ డుప్లెసిస్ పుల్ షాట్ ఆడాడు. మిస్ టైమ్ అయిన బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న రోవ్‌మన్ పోవెల్ ముందు డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఆర్‌సీబీ వికెట్ పడగొట్టేందుకు ఓవైపు బౌలర్లు తీవ్రంగా శ్రమించగా.. రోవ్‌మెన్ పోవెల్ సూపర్ ఫీల్డింగ్‌తో తొలి వికెట్ అందించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి కోహ్లీ-ఫాఫ్ డుప్లెసిస్ శుభారంభం అందించారు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆచితూచి ఆడిన ఈ జోడీ లూజ్ బాల్స్‌ను బౌండరీలకు తరలించింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కాస్త ఓపికగా ఆడిన ఈ జోడీ.. సందీప్ శర్మ, ఆవేశ్ ఖాన్ ఓవర్లను టార్గెట్ చేసి పరుగులు రాబట్టారు.

క్రీజులో సెట్ అయిన ఈ జోడీని రోవ్‌మన్ పోవెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో విడదీయగా.. హాఫ్ సెంచరీ దిశగా సాగిన విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33) యుజ్వేంద్ర చాహల్ ఔట్ చేశాడు. భారీ సిక్సర్‌కు ప్రయత్నించిన కోహ్లీ.. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Wednesday, May 22, 2024, 20:23 [IST]
Other articles published on May 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+