Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs RCB:‌ కీలక మ్యాచ్‌లో ఆర్‌సీబీని వెంటాడిన దురదృష్టం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం ఉండనుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు.

'ఈ పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. గత మ్యాచ్‌లో విపరీతమైన డ్యూ వచ్చింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఐకానిక్ స్టేడియంలో ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ మైదానంలో అభిమానుల నుంచి గొప్ప శక్తి లభిస్తోంది.

RR vs RCB Rajasthan Royals have won the toss and opted to bowl first

క్రికెట్ నేర్పించిన పాఠాలపై ఫోకస్ పెట్టాం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆత్మవిశ్వాసంతో ఆడటం ముఖ్యం. ఫిట్‌నెస్, గాయాల సమస్యల మధ్య అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం సవాల్‌తో కూడుకున్న పని. హెట్‌మైర్ అందుబాటులోకి వచ్చాడు.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. 'గత మ్యాచ్ చూసిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయడమే ఉత్తమం అనిపించింది. ఆరంభంలో వికెట్‌ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. పిచ్ పొడిగా ఉండటంతో పాటు కొంచెం గడ్డి ఉంది. మేం మా స్కిల్స్‌పై ఫోకస్ పెట్టాం.

సీఎస్‌కేతో మేం సాధించిన విజయం అసాధారణం. నాకౌట్ స్టేజ్‌లో సూపర్ మ్యాన్ ప్రదర్శనలు చేస్తేనే విజయాలు దక్కుతాయి. ఈ మ్యాచ్‌లో కూడా మా కుర్రాళ్లు అదే జోరును కనబరుస్తారని ఆశిస్తున్నా. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తున్నాం.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

కీలక ఎలిమినేటర్‌లో ఆర్‌సీబీ టాస్ ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. టాస్ గెలిస్తే బాగుండేదని, పిచ్ కండిషన్స్ అండ్వాంటేజ్ దక్కేదని అభిప్రాయపడుతున్నారు. పవర్ ప్లేను ఆచితూచి ఆడటం చాలా కీలకమని సూచిస్తున్నారు.

తుది జట్లు:

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), రజత్ పటిదార్, కామెరూన్ గ్రీన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లేర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పోవెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ .

Story first published: Wednesday, May 22, 2024, 19:27 [IST]
Other articles published on May 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+