For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs RCB: మైదానంలో హైడ్రామా.. కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్‌నే శంకించిన ఫీల్డ్ అంపైర్! (వీడియో)

 RR vs RCB: High Drama! Umpire Recalls Devdutt Padikkal After Virat Kohli Takes A Stunning Catch

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ తన ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. విరాట్ స్టన్నింగ్ క్యాచ్‌కు రాజస్థాన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఈ వికెట్ విషయంలో మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్‌ను ఫీల్డ్ అంపైర్లు శంకించారు. బంతిని అద్భుతంగా అందుకున్నప్పటికీ.. కిందపెట్టాడా? అనే సందేహంతో థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు.

మైదానంలో హైడ్రామా..

దాంతో మైదానం వీడిన దేవదత్ పడిక్కల్‌ను ఫోర్త్ అంపైర్ మళ్లీ మైదానంలోకి పంపగా.. క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌ను వేచి చూడాలని ఫీల్డ్ అంపైర్లు కోరారు. దాంతో అసలేం జరుగుతుందని ఆర్‌సీబీ ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. ఆర్‌సీబీ డగౌట్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కానీ టీవీ రిప్లేలో బంతి నేలకు తాకలేదని స్పష్టంగా తేలడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దాంతో ఆర్‌సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హర్షల్ పటేల్ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?

10వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ పరుగులు రాకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అతని స్లోయర్ బాల్స్‌ను ఆడటంలో బట్లర్, పడిక్కల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దాంతో బ్యాట్స్‌మన్‌ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఇక ఆ ఓవర్ చివరి బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పడిక్కల్ క్యాచ్ ఔటయ్యాడు. హర్షల్ వేసిన స్లోయర్ బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన పడిక్కల్.. నిర్లక్ష్యపు షాట్‌తో పెవిలియన్ చేరాడు. పడిక్కల్ బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచిన బంతిని మిడాఫ్‌లో ఉన్న కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు. అయితే ఈ హై క్యాచ్‌ను అందుకునే క్రమంలో సమన్వయం కోల్పోయిన అతను కిందపడ్డాడు. ఈ క్రమంలో బంతి నేలకు తాకిందా? అనే సందేహం అంపైర్‌కి కలిగింది.

బట్లర్ విధ్వంసం...

బట్లర్ విధ్వంసం...

జోస్ బట్లర్(47 బంతుల్లో 6 సిక్స్‌లతో 70 నాటౌట్) మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు రాజస్థాన్ రాయల్స్ 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక బట్లర్‌కు హెట్‌మైర్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, April 5, 2022, 22:34 [IST]
Other articles published on Apr 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+