Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs RCB: నో మ్యాక్స్‌వెల్.. అందుకే ఫీల్డింగ్ తీసుకున్నా: ఫాఫ్ డుప్లెసిస్

 Faf du Plessis says Well have a bowl,

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించనట్లుగా ఈ మ్యాచ్‌కు విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా కాంట్రాక్టు ప్లేయర్లు ఏప్రిల్ 6 వరకు ఐపీఎల్ ఆడటానికి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇవ్వకపోవడంతో మ్యాక్సీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దాంతో ఆర్‌సీబీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

ఇక టాస్ గెలిచి ఫాఫ్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకొని ట్రెండ్‌ను ఫాలో అవుతున్నానని చెప్పాడు. డ్యూ ప్రభావం కూడా ఉండనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. పిచ్ కూడా భిన్నంగా కనిపిస్తుందని, డ్యూ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలన్నాడు. గత మ్యాచ్‌లో సాధించిన విజయంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. సామర్థ్యం మేరకు రాణించకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కష్టమేనని, ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

ఇక టాస్ గురించి తాము అస్సలు ఆలోచించలేదని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. పిచ్ చాలా భిన్నంగా కనిపిస్తుందని, మా సామర్థ్యం మేరకు రాణిస్తామని చెప్పాడు. జట్టులో ఎవరీ పాత్రపై వారికి క్లారిటీ ఉందని, ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌ఆర్ విజయం సాధించగా.. ఆర్‌సీబీ ఒకటి ఓడి మరొకటి గెలిచింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 24 మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇందులో పన్నెండింటిలో ఆర్సీబీ విజయం సాధించగా.. రాజస్తాన్‌ 10 మ్యాచ్‌లలో గెలుపొందింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.

తుది జట్లు:
ఆర్‌సీబీ: ఫాప్‌ డుప్లెసిసస్‌(కెప్టెన్‌), అనూజ్‌ రావత్‌, విరాట్‌ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌, రూథర్‌ఫర్డ్‌, షాబాజ్‌ అహ్మద్‌, వానిందు హసరంగ, డేవిడ్‌ విల్లే, హర్షల్‌ పటేల్‌, ఆకాశ్‌ దీప్‌, మహమ్మద్‌ సిరాజ్‌

రాజస్తాన్‌: జోస్‌ బట్లర్‌, యశస్వి జైశ్వాల్‌, సంజూ శాంసన్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, రియాన్‌ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, నవదీప్‌ సైనీ, ట్రెంట్‌ బౌల్ట్‌, యుజువేంద్ర చహల్‌, ప్రసిద్‌ కృష్ణ.

Story first published: Tuesday, April 5, 2022, 19:23 [IST]
Other articles published on Apr 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+