జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివర్లో అనూజ్ రావత్(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆడమ్ జంపా, కేఎమ్ ఆసిఫ్ రెండే వికెట్లు తీయగా.. సందీప్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ(18), డుప్లెసిస్ శుభారంభం అందించారు. వికెట్ నెమ్మదిగా ఉండటంతో ఈ జోడీ ఆచితూచి ఆడింది. దాంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం కేఎమ్ ఆసిఫ్ బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఈ పరిస్థితుల్లో డుప్లెసిస్, కలిసి గ్లేన్ మ్యాక్స్‌వెల్ జట్టును ఆదుకున్నారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించిన ఈ జోడీ.. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఆసిఫ్ విడదీసాడు. డుప్లెసిస్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే ఆడమ్ జంపా ఒకే ఓవర్‌లో మహిపాల్ లోమ్రోర్(1), దినేశ్ కార్తీక్‌లను పెవిలియన్ చేర్చాడు.
ఆ కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గ్లేన్ మ్యాక్స్‌వెల్ కూడా ఔటవ్వగా.. ఆర్‌సీబీ సాధారణ స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ చివర్లో అనూజ్ రావడత్ 3 ఫోర్లు, 2సిక్స్‌లతో 29 పరుగులు చేసి జట్టు స్కోర్‌ను 170 ధాటించాడు.