Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs PBKS: అందుకే ఫీల్డింగ్ తీసుకున్నా: సంజూ శాంసన్

గువహతి: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అంతేకాకుండా చేజింగ్‌లో తమ టీమ్ సత్తాను తెలుసుకోవాలనుకున్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు.

తమ సెకండ్ హోమ్ గ్రౌండ్ అయిన ఇక్కడ ఆడటం చాలా సంతోషంగా ఉందన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు తమ ఆటగాళ్లకు ఆడితే సరిపోతుందన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పిన సంజూ.. జట్టుగా ఎదుగుతున్న తీరు చాలా సంతోషంగా ఉందన్నాడు. ముఖ్యంగా జైస్వాల్, రియాన్ పరాగ్.. అనుభవం కలిగిన ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నారని చెప్పాడు.

RR vs PBKS: Rajasthan Royals win toss, invite Punjab Kings to bat first

టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. డ్యూ ఉండనున్న నేపథ్యంలో ముందు బౌలింగ్ చేయడం కలిసొస్తుందని చెప్పాడు. అయితే టాస్ ఓడిపోవడానికి పెద్దగా పరిగణించి అనవసర ఒత్తిడికి గురవ్వడం లేదని, ప్రణాళికలకు తగ్గట్లు ఆడితే విజయం సాధించవచ్చని తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పిన శిఖర్ ధావన్.. ప్రత్యర్ధి జట్టు చాలా బలమైనదని, సాయశక్తులా విజయం కోసం పోరాడుతామని చెప్పాడు.

తుది జట్లు:

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ(కీపర్), షారుఖ్ ఖాన్, సామ్ కరణ్, సికిందర్ రాజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కీపర్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మైర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Wednesday, April 5, 2023, 19:28 [IST]
Other articles published on Apr 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+