Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs PBKS: జోస్ బట్లర్ కళ్లు చెదిరే క్యాచ్.. ఊపిరి పీల్చుకున్న రాజస్థాన్ రాయల్స్! (వీడియో)

గువహతి: రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో బట్లర్ సూపర్ ఫీల్డింగ్‌తో రాజస్థాన్‌కు బ్రేక్ త్రూ అందించాడు. సూపర్ డైవ్‌.. థ్రిల్లింగ్ క్యాచ్‌తో మైమరిపించాడు. అతని అద్భుత ఫీల్డింగ్‌కు పంజాబ్ కింగ్స్ హాఫ్ సెంచరీ హీరో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) పెవిలియన్ బాట పట్టాడు.

పంజాబ్ ఇన్నింగ్స్ సందర్భంగా జాసన్ హోల్డర్ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని హోల్డర్ షార్ట్ బాల్‌గా వేయగా.. ప్రభ్‌సిమ్రాన్ స్లాప్ షాట్ ఆడేప్రయత్నం చేశాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి గాల్లోకి లేవగా.. లాంగాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న జోస్ బట్లర్ పరుగెత్తుకొచ్చి సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. దాంతో ప్రభ్‌సిమ్రాన్ సూపర్ ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది.

Aiden Markram, Heinrich Klaasen to arrive

రాజస్థాన్ రాయల్స్‌కు బ్రేక్ లభించింది. ఈ వికెట్‌తో తొలి వికెట్‌కు నమోదైన 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బట్లర్‌కు సంబంధించిన క్యాచ్ వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వాటే క్యాచ్ అంటూ నెటిజన్లు బట్లర్‌ను ప్రశంసిస్తున్నాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ప్రభ్‌సిమ్రాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. శిఖర్ ధావన్ యాంకర్ రోల్ పోషించాడు. దాంతో పవర్ ప్లేలోనే పంజాబ్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రభ్ సిమ్రాన్ ఇచ్చిన క్యాచ్‌ను దేవదత్ పడిక్కల్ నేలపాలు. ఈ అవకాశంతో చెలరేగిన ప్రభ్‌సిమ్రాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను ఔటైన తర్వాత క్రీజులోకి భానుక రాజపక్స(1) రాగా.. అతను గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి జితేశ్ శర్మ రాగా.. ధావన్ ఆచితూచి ఆడుతున్నాడు.
Story first published: Wednesday, April 5, 2023, 20:52 [IST]
Other articles published on Apr 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+