For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs MI: హార్దిక్ పాండ్యా కక్ష సాధింపు చర్య.. ఆకాశ్ మధ్వాల్‌పై వేటు!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మూడు మార్పులతో బరిలోకి దిగడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

ఈ మ్యాచ్‌కు ఆకాశ్ మధ్వాల్‌ను పక్కనపెట్టడాన్ని తప్పుబడుతున్నారు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా ఆకాశ్ మధ్వాల్‌ను పక్కనపెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి హార్దిక్ పాండ్యా కక్ష సాధింపు చర్యని ఆరోపిస్తున్నారు. కెప్టెన్‌గా తన మాట వినడం లేదనే ఆకాశ్ మధ్వాల్‌ను ఉద్దేశపూర్వకంగా తప్పించాడని విమర్శలు గుప్పిస్తున్నారు.

RR vs MI Jasprit Bumrah trolled after Akash Madhwal dropped in IPL 2024 Match vs Rajasthan

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సూచనలను ఆకాశ్ మధ్వాల్‌ పట్టించుకోలేదు. హార్దిక్ పాండ్యా కంటే రోహిత్ శర్మ ఆదేశాలనే అనుసరించాడు. హార్దిక్ పాండ్యా జోక్యం చేసుకొని సూచనలు చేసినా పెడ చెవిన పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో ఆకాశ్ మధ్వాల్ దారుణంగా విఫలమయ్యాడు.

3.1 ఓవర్లు బౌలింగ్ చేసి 46 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒకే ఒక్క వికెట్ తీసిన ఆకాశ్ మధ్వాల్.. డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చి జట్టును ఓడించినంత పనిచేశాడు. ఈ ప్రదర్శనను సాకుగా చూపించిన హార్దిక్ పాండ్యా అతన్ని తుది జట్టు నుంచి తప్పించాడు. ఇక ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యా చేపట్టినప్పటి నుంచి ఆ జట్టు రెండు గ్రూప్‌లుగా విడిపోయింది.

RR vs MI Jasprit Bumrah trolled after Akash Madhwal dropped in IPL 2024 Match vs Rajasthan

రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఆకాశ్ మధ్వాల్ ఒక గ్రూప్‌గా ఉండగా.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, ఇతర ఆటగాళ్లు మరో గ్రూప్‌ను మెయింటేన్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు తగ్గట్లుగానే మైదానంలో ముంబై ఆటగాళ్లు హార్దిక్ సహకరించకపోవడం.. అతను వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు.

తుది జట్లు:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పోవెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, నెహల్ వాదేరా, మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా.

Story first published: Monday, April 22, 2024, 20:00 [IST]
Other articles published on Apr 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+