Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs MI Dream11: డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! ఇరు జట్లకు చావో రేవో! తుది జట్లు ఇవే!!

RR vs MI Dream11 Prediction: Captain, Vice-Captain Tips And Playing XI, Pitch Report For Match 51

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారు చేసుకోగా.. ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం మూడు జట్లు రేసులో ఉన్నాయి. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో 6, 7 స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్​, రాజస్థాన్​ రాయల్స్​ జట్లు ఈరోజు తలపడనున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చావో రేవో అన్న పరిస్థితి. గెలిచిన జట్టే ముందుకు వెళ్లనుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్, ముంబై జట్లు తలపడనున్నాయి.

ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంనుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఓటీటీలో కూడా ఈ మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్.. హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.

ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే

ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే

ఐపీఎల్‌ 2021 ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ఇకపై ఆడాల్సిన తమ రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఈ రెండు జట్లూ తలపడనుండగా.. ఎవరు గెలుస్తారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. గెలిచిన జట్టు ఒక అడుగు ముందుకేసి.. మరో మ్యాచ్‌ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఓడిన జట్టు మాత్రం నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

అయితే రాజస్థాన్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. నాలుగో స్థానంలో ప్లే ఆఫ్స్‌ చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ముంబై మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్‌ రాయల్స్ ఫలితంపైనా ఆధారపడాల్సి ఉంది. ఇది కాస్త కష్టమనే చెప్పాలి. ఈరోజు ముంబై గెలిచినా.. ప్లే ఆఫ్స్‌ చేరుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

ఇంచుమించు ఒకేలా

ఇంచుమించు ఒకేలా

యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2021 రెండో దశలో ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ఇంచుమించు ఒకేలా ఆడుతున్నాయి. రాజస్థాన్‌ ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడు ఓటములు, 2 విజయాలతో కొనసాగుతుండగా.. ముంబై నాలుగు ఓటములు ఒక విజయంతో ప్లే ఆఫ్స్‌ రేసులో కొట్టుమిట్టాడుతోంది.

అయితే గత మ్యాచ్‌లో రాజస్థాన్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించడమే ఇప్పుడు ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. బలమైన చెన్నైపై విజయం సాధించడంతో రాజస్థాన్ టీమ్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచులో ముంబై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో రోహిత్‌ సేనపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి.

బ్యాటర్లే ప్రధాన కారణం

బ్యాటర్లే ప్రధాన కారణం

ఐపీఎల్ 2021లో ముంబై ఇండియన్స్ వైఫల్యానికి ప్రధాన కారణం బ్యాటర్లు సరిగ్గా ఆడకపోవడమే. ఇప్పటివరకు ఓపెనర్లు రోహిత్​ శర్మ, క్వింటన్ డికాక్​ సరైన భాగస్వామ్యం నెలకొల్పలేకపోయారు. డికాక్‌ మాత్రం పరుగులు చేస్తూ పర్వాలేదనిపిస్తున్నాడు. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్​ యాదవ్​ గత మ్యాచ్​లో పర్వాలేదనిపించినా.. అతడిపై ఇప్పుడు పెద్దగా అంచనాలు లేవు. మిడిల్​ ఆర్డర్​లో సౌరభ్​ తివారి కొన్ని మ్యాచుల్లో మెరుపులు మెరిపించాడు.

ఆల్​రౌండర్లు కీరన్ పొలార్డ్​, హార్దిక్​ పాండ్యా, కృనాల్​ పాండ్యాలు జట్టుకు అవసరమైన సమయంలో రాణించడంలో విఫలమవుతున్నారు. బౌలింగ్​ లైనప్​లో ట్రెంట్ బౌల్ట్​, జస్ప్రీత్ బుమ్రా, కృనాల్​ పాండ్యా, రాహుల్ చహర్ సత్తాచాటడం లేదు. వీళ్లంతా జట్టుగా రాణిస్తే తప్ప ముంబై ఈరోజటి మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించే పరిస్థితి లేదు.

IPL 2021: మంచి టీ20 క్రికెటర్‌ను తయారు చేయాలంటే.. రవీంద్ర జడేజానే సరైన ఉదాహరణ: వాన్‌

ఫామ్‌లో రాజస్థాన్

ఫామ్‌లో రాజస్థాన్

రాజస్థాన్‌లో ప్రస్తుతం బ్యాటర్లు అంతా ఫామ్‌లో ఉన్నట్టే. చెన్నై నిర్ధేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌, యశస్వి జైశ్వాల్‌ మంచి ఊపులో ఉన్నారు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌, ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె ధాటిగా ఆడుతున్నారు. ఈ నలుగురు మరోసారి చెలరేగితే ముంబైకి కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో రాహుల్‌ తెవాతియా, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ మరింత రాణిస్తే.. ముంబైని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇప్పటివరకు ఇరు జట్లు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడగా రాజస్థాన్‌ 12, ముంబయి 13 మ్యాచ్‌లు గెలుపొందాయి. ఇక ఈరోజు మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఇంటిముఖం పడుతారో చూడాలి. షార్జా మైదానం చిన్నదే కాబట్టి భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. చివరి 6 మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక స్కోరు 164. 150 కంటే ఎక్కువ పరుగులు చేస్తే.. ఈ వికెట్‌పై గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్​ కీపర్​), శివమ్​ దుబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఆకాశ్ సింగ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మన్.

ముంబై ఇండియన్స్​: రోహిత్​ శర్మ (కెప్టెన్​), క్వింటన్​ డికాక్ (వికెట్​ కీపర్​), సూర్యకుమార్ యాదవ్​, సౌరభ్ తివారి, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కిరన్​ పొలార్డ్, నాథన్ కౌల్టర్​ నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్​ బుమ్రా, ట్రెంట్​ బౌల్ట్.

డ్రీమ్ 11 టీమ్

డ్రీమ్ 11 టీమ్

సంజు శాంసన్ (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, కిరాన్ పొలార్డ్, శివమ్ దుబే, జస్ప్రీత్ బుమ్రా, ముస్తఫిజుర్ రహమాన్, నాథన్ కౌల్టర్ నైల్, చేతన్ సకారియా.

Story first published: Tuesday, October 5, 2021, 17:16 [IST]
Other articles published on Oct 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+