Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే క్వింటన్ డికాక్‌ను తీసుకోలేదు: కేఎల్ రాహుల్

జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావంతో పాటు పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. నాలుగేళ్ల తర్వాత జైపూర్‌లో ఆడటం సంతోషంగా ఉందని చెప్పాడు.

ఒత్తిడిలో ఎలా ఆడుతాం అనేదానిపైనే విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయని తెలిపాడు. తమ జట్టు ఫియర్‌లెస్ అటిట్యూడ్‌తో ఆడుతోందని చెప్పాడు. జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన సంజూ.. ఆడమ్ జంపా స్థానంలో జాసన్ హోల్డర్ వచ్చాడని తెలిపాడు.

RR vs LSG

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. జైపూర్‌లో తమ జట్టుకు ఇదే తొలి మ్యాచ్ అని చెప్పిన రాహుల్.. శుభారంభం అందుకోవడం చాలా ముఖ్యమన్నాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచితే మైదాన పరిస్థితులతో సంబంధం లేకుండా మ్యాచ్‌పై పట్టుబిగించవచ్చని చెప్పాడు.

తమ జట్టు ప్రణాళికలకు తగ్గట్లు ఆడుతుందని, బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాలకు స్పష్టత ఉందన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటుతు విజయాలందుకున్నామని చెప్పిన రాహుల్.. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో తమ జట్టు సమతూకంగా ఉందన్నాడు. దాంతో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

ఈ క్రమంలోనే క్వింటన్ డికాక్‌ను జట్టులోకి తీసుకోలేదని, అతను మరికొన్ని మ్యాచ్‌లు వేచి చూడక తప్పదన్నాడు. అయితే క్వింటన్ డికాక్‌తో ఓపెనింగ్ చేయడాన్ని మాత్రం తాను ఆస్వాదిస్తానని చెప్పాడు.

ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా.. ఐదింటిలో మూడు గెలిచిన లక్నో రెండో స్థానంలో ఉంది.

తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మైర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(కీపర్), ఆయుష్ బదోని, నవీన్ ఉల్ హక్, ఆవేశ్ ఖాన్, యుధ్‌విర్ సింగ్ చరక్, రవి బిష్ణోయ్.

Story first published: Wednesday, April 19, 2023, 19:29 [IST]
Other articles published on Apr 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+