Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs LSG: టీ20ల్లో టెస్ట్ మ్యాచ్‌.. కేఎల్ రాహుల్‌పై పేలుతున్న మీమ్స్!

జైపూర్: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై అభిమానులు మండిపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్‌తో జట్టుకు తీరని నష్టం చేశాడు. 32 బంతుల్లో 39 పరుగులే చేసిన రాహుల్.. నాలుగు ఫోర్లతో పాటు ఓ సిక్సర్ బాదాడు. రాహుల్ జిడ్డు బ్యాటింగ్ కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

దాంతో రాహుల్‌పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ బ్యాటింగ్ 'వన్ బాల్ వన్ రన్'తో పాటు 'వన్ ఓవర్ నో రన్' అన్నంత పేలవంగా సాగింది. ఐపీఎల్ -2023లో అతడి ఆటతీరు 'పరమ బోరింగ్'కే బోర్ తెప్పించేలా ఉంది. రాహుల్ స్ట్రైక్ రేట్ అయితే మరీ దారుణంగా ఉంది.

KL Rahul brutally trolled

నెల రోజుల క్రితం భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్.. ఐపీఎల్‌లో తన టెస్ట్ ఫార్మాట్ ప్రతిభను చూపిస్తున్నాడు. ఈ సీజన్ లో రాహుల్ ఆట టెస్టుల కంటే దారుణంగా ఉంది.

ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే ఏ జట్టుకైనా ఫస్ట్ పవర్ ప్లే (తొలి 6 ఓవర్లు) కీలకం. పవర్ ప్లేలో వీరబాదుడు బాదితే తర్వాత ఔటైనా ఆపై వచ్చే బ్యాటర్లు భారీ స్కోర్లు చేసేందుకు వీలుచిక్కుతుంది. కానీ రాహుల్ మాత్రం దానికి విరుద్దంగా ఆడాడు. ఢిల్లీతో మ్యాచ్ లో 12 బంతులు ఆడిన రాహుల్ 8 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ 66.67 గా ఉంది. చెన్నైతో మ్యాచ్ లో 18 బంతుల్లో 20 పరుగులు (స్ట్రైక్ రేట్ 111. 11), సన్ రైజర్స్ హైదరాబాద్‌తో 31 బంతుల్లో 35 రన్స్ (స్ట్రైక్ రేట్ 112.90), ఆర్సీబీతో 20 బంతుల్లో 18 రన్స్ (స్ట్రైక్ రేట్ 90), పంజాబ్ తో 56 బంతుల్లో 74 పరుగులు చేసినా స్ట్రైక్ రేట్ 132.14 మాత్రమే ఉంది.

ఇక తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్ లో 32 బంతులాడి 39 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 121 గా నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి 194 పరుగులు చేసిన రాహుల్ స్ట్రైక్ రేట్ 114. 79 మాత్రంగానే ఉంది. ఐపీఎల్-16లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన టాప్ -15 బ్యాటర్లలో 11 వ స్థానంలో ఉన్న రాహుల్ స్ట్రైక్ రేట్ మాత్రమే అందరికంటే తక్కువగా (114.79) ఉంది. దాంతో ఐపీఎల్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడటం ఏంది రాహుల్ అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

Story first published: Wednesday, April 19, 2023, 23:10 [IST]
Other articles published on Apr 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+