Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs KKR: యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా!

 RR vs KKR: Yuzvendra Chahal claims hattrick as Rajasthan beat Kolkata

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌ఆర్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్. జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103) శతకానికి అండగా సంజూ శాంసన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) షిమ్రన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా..శివం మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 210 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), ఆరోన్ ఫించ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్(5/40) హ్యాట్రిక్ వికెట్‌తో పాటు తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. మెక్‌కాయ్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిధ్, అశ్విన్ తలో వికెట్ తీసారు.

డైమండ్ డక్‌తో షురూ..

డైమండ్ డక్‌తో షురూ..

218 పరుగుల రికార్డు లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భారీ లక్ష్యచేధనలో భాగంగా పవర్ ప్లేలో ధాటిగా ఆడాలనే ఉద్దేశంతో కేకేఆర్‌.. వ్యూహాత్మకంగా సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపించగా.. హెట్‌మైర్ సూపర్ ఫీల్డింగ్‌తో రనౌట్ చేశాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతిని మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్.. కవర్స్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. హెట్‌మైర్ సూపర్ ఫీల్డింగ్‌తో దెబ్బకొట్టాడు. అతను విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో నరైన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి రాగా.. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ ధాటిగా ఆడాడు. దాంతో కేకేఆర్ వికెట్ నష్టానికి పవర్ ప్లే‌లో 57 పరుగులు చేసింది.

ఫించ్ హాఫ్ సెంచరీ..

ఫించ్ హాఫ్ సెంచరీ..

ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్‌ బోర్డును పరుగెత్తించింది. ప్రసిధ్ వేసిన 9వ ఓవర్‌ రెండో బంతిని బౌండరీ బాదిన ఆరోన్ ఫించ్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే మరో బౌండరీ బాదిన అదే జోరులో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో 2వ వికెట్‌కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా సైతం ధాటిగా ఆడాడు. అయితే అతని జోరుకు చాహల్ బ్రేక్ వేసాడు. ఊరించే బంతితో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన శ్రేయస్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

హ్యాట్రిక్‌తో చెలరేగిన చాహల్..

హ్యాట్రిక్‌తో చెలరేగిన చాహల్..

అయితే క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్‌ను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్ చేర్చి.. అశ్విన్ కోలుకోలేని దెబ్బతీసాడు. క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి శ్రేయస్ భారీ షాట్లతో సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. 17వ ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను స్టంపౌట్ చేసిన చాహల్.. నాలుగో బంతికి శ్రేయస్ అయ్యర్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ వెంటనే శివమ్ మావీ, కమిన్స్ ఔటవ్వడంతో చాహల్‌‌కు హ్యాట్రిక్ వికెట్ పడటంతో పాటు తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. సూపర్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చాహల్ హ్యాట్రిక్ దెబ్బకు రాజస్థాన్ విజయం ఖాయమని అంతా భావించారు.

 ఉమేశ్ ఊరించినా..

ఉమేశ్ ఊరించినా..

కానీ ఉమేశ్ యాదవ్ బౌల్ట్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో 20 పరుగులు పిండుకొని టెన్షన్ పెట్టాడు. కానీ షెల్డన్ జాక్సన్ నుంచి అతనికి సరైన సహకారం అందించకపోవడంత గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 11 పరుగులు అవసరమవ్వగా.. ఒబెడ్ మెక్‌కాయ్ సూపర్ బౌలింగ్‌తో జాక్సన్, ఉమేశ్‌లను ఔట్ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Tuesday, April 19, 2022, 0:06 [IST]
Other articles published on Apr 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+