RR vs KKR ప్రివ్యూ: సమఉజ్జీల సమరం.. కోల్‌కతా గెలిచెనా? రాయల్స్ రఫ్ఫాడించెనా?

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. పవర్‌ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్.. బుధవారం జరిగే మ్యాచ్‌లో సంచలనాల రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన రాజస్థాన్ రాయల్స్.. పాయిట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓ విజయం, మరో ఓటమితో ఏడో స్థానంలో కొనసాగుతోంది. తక్కువగా అంచనా వేస్తే ఎంతటి బలమైన జట్టునైనా ఓడిస్తామని రాజస్థాన్ రాయల్స్ నిరూపించగా.. తొలి ఓటమి పాఠంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆల్‌రౌండ్‌షో గాడిలో పడింది.
ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. బలబలాల పరంగా పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ అనుభవం దృష్ట్యా కేకేఆర్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 20 సార్లు తలపడగా 10-10తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి పై చేయి సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. మరీ గెలుపు ఏ జట్టును వరిస్తుందో..? చూడాలి!

పటిష్టంగా రాజస్థాన్..
అండర్ డాగ్స్‌గా లీగ్‌ను మొదలుపెట్టిన రాజస్థాన్ గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుతాలు చేసింది. సునామీ ఆటతీరుతో చెలరేగుతూ నమ్మశక్యంగాని స్థాయిలో రికార్డు విజయాలను సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ 200 రన్స్‌ను ఛేజ్ చేయడంతో టీమ్ మొత్తం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. సంజూ శాంసన్, రాహుల్ తెవాటియా రూపంలో ఇద్దరు స్టార్లు దొరకడంతో రాజస్థాన్ బ్యాటింగ్ మరింత పటిష్టంగా తయారైంది.
పంజాబ్‌పై తెవాటియా ఆడిన ఆటను అంత తొందరగా మర్చిపోలేరు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ అతనిపై భారీ ఆశలు ఉన్నాయి. ఇక శాంసన్ 214.86 స్ట్రైక్ రేట్‌తో చెలరేగుతుండటం ప్రత్యర్థి బౌలర్లకు మింగుడు పడని అంశం. కెప్టెన్ స్మిత్ ఫర్వాలేనిపిస్తున్నా.. బట్లర్ గాడిలో పడాలి. మిడిలార్డర్‌లో రియాన్ పరాగ్, ఊతప్ప మెరిస్తే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో ఆర్చర్, కరన్, శ్రేయస్ గోపాల్ అంచనాలను అందుకోవడం శుభపరిణామం. జయదేవ్ ఉనద్కత్ టచ్‌లోకి రావాలి.

కోల్‌కతాకు కఠిన పరీక్ష..
ఇక కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యంత కీలకంగా మారింది. ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్‌కు ఇప్పటి వరకు తక్కువ అవకాశాలే వచ్చాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లో రస్సెల్ బ్యాటింగ్ లైనప్‌లో పైకి వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ దినేశ్, నితీశ్ రానా గాడిలో పడాల్సి ఉంది. ఓపెనర్లలో శుభ్‌మన్ గిల్ పెర్ఫామెన్స్ సూపర్బ్‌గా ఉన్నా ఫించ్ హిట్టర్ సునీల్ నరైన్ ఫామ్‌లో లేకపోవడం లోటుగా మారింది. బౌలర్లలో కుల్దీప్, మావి, ప్యాట్ కమిన్స్, నాగర్‌కోటి మరోసారి మెరవాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో తేలిపోయిన కమిన్స్.. రెండో మ్యాచ్‌లో అదరగొట్టాడు. తానెంతటి విలువైన ఆటగాడినో తన ఆటతో నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగితే కోల్‌కతాకు తిరుగుండదు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో అన్ని వైపుల నుంచి కోల్‌కతాకు కఠిన పరీక్ష ఎదురుకానుంది.

తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్(కీపర్), స్టీవ్ స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, అంకిత్ రాజ్‌పూత్/వరుణ్ ఆరోన్, జయదేవ్ ఉనద్కత్
కోల్‌కతా నైట్ రైడర్స్: శుభమన్ గిల్, సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్(కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, కమలేష్ నాగర్ కోటీ, పాట్ కమిన్స్, శివమ్ మావి, కుద్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

పిచ్ రిపోర్ట్:
ఇప్పటి వరకు ఈ సీజన్‌లో జరిగిన 12 మ్యాచ్‌ల్లో 5 ఇక్కడే జరగాయి. ఇది ఆరో మ్యాచ్. కానీ ఇరు జట్లకు ఈ మైదానం కొత్తనే. గత ఐదు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బ్యాటింగ్‌కు ఫేవర్‌గా మారింది. రెండు మ్యాచ్‌లు టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉండనుంది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications